
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ గా తేలిన హాకీ టీమ్ ఫార్వర్డ్ మన్‌దీప్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ‘పాజిటివ్ వచ్చిన ప్లేయర్లను పరీక్షించే టైమ్‌లో మన్‌దీప్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. దీంతో కరోనా వైరస్ లక్షణాలు ఎక్కువ కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎస్ ఎస్ పర్ష్ మల్టీ స్పెషాలిటి ఆసుపత్రికి తరలించాం. చికిత్స తర్వాత కోలుకున్నాడు’ అని సాయ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆరుగురు ప్లేయర్లు కరోనా బారిన పడటంతో.. నేషనల్ క్యాంప్‌ను నిర్వహించాలా? వద్దా ? అనే విషయంపై సాయ్ ఎటూ తేల్చుకోలేక పోతున్నది. అయితే ఉమెన్స్ క్యాంప్ యధావిథిగా నడుస్తుందని తెలిపింది. ప్రస్తుతం 24 మంది మహిళా ప్లేయర్లు క్వారంటైన్‌లో ఉన్నారు.