28 ఏళ్ల తర్వాత.. ఇండియా అంపైర్లు, టెక్నికల్ ఆఫీసర్లు లేకుండా హాకీ వరల్డ్ కప్

28 ఏళ్ల తర్వాత.. ఇండియా అంపైర్లు, టెక్నికల్ ఆఫీసర్లు లేకుండా హాకీ వరల్డ్ కప్

న్యూఢిల్లీ: ఒకప్పుడు హాకీ క్రీడకు రారాజుగా పేరొందిన ఇండియాలో ఇప్పుడు అంపైర్లు కరువయ్యారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఇండియా అంపైర్లు, టెక్నికల్‌‌‌‌ ఆఫీసర్లు లేకుండా హాకీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ జరగబోతున్నది. ఈ పరిణామంపై మాజీ ఇంటర్నేషనల్‌‌‌‌ అంపైర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్‌‌‌‌, బెల్జియం వేదికగా జరిగే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా నుంచి ఒక్క అంపైర్‌‌‌‌కు కూడా స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ ప్యానెల్‌‌‌‌లో యూరోప్‌‌‌‌ దేశాల అధికారులదే ఆధిపత్యంగా ఉంది. గతంలో అమర్‌‌‌‌జిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ బవా, తర్లోక్‌‌‌‌ సింగ్‌‌‌‌ భుల్లర్‌‌‌‌, సతీందర్‌‌‌‌ శర్మ, ఆర్‌‌‌‌.వి. రఘుప్రసాద్‌‌‌‌.. ఇండియా నుంచి వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో బాధ్యతలను నిర్వర్తించారు.

ఆర్థిక భద్రత కొరవడటం ఈ రంగానికి పెద్ద సవాలుగా మారుతోందని వెటరన్ అంపైర్లు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతిభకు కొదవలేదని, సమాఖ్య నుంచి తగిన మద్దతు లభిస్తేనే మన అంపైర్లు మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగలరని వారు స్పష్టం చేశారు.