
హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ హిందూ దేవతల్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విల్ రెండు చేతుల్ని కలిపి దండం పెట్టి పూజిస్తూ ఎంతో అరివీర భక్తుడిలా కనిపించాడు. ఒక పాశ్చాత్య దేశానికి చెందిన వ్యక్తి.. క్రైస్తవాన్ని ఆచరించే వాళ్లు ఇలా చేయడం నిజంగానే ఆశ్చర్యకరం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫోటోకి కోటిన్నర మంది పైగా లైక్ కొట్టడం ఓ సంచలనం. హరిద్వార్ కు తన ఫేస్ బుక్ వాచ్ షో కోసం వచ్చిన విల్ స్మిత్ ఈ టూర్ ని లాంగ్ టైమ్ కి పొడిగించి ఇలా గుడులు గోపురాలు తిరిగేస్తున్నాడు. భారతదేశం నాకు ఎన్నో కొత్త విషయాల్ని అనుభవమయ్యేలా చేసిందన్నాడు విల్ స్మిత్.
విల్ స్మిత్ భారత సంప్రదాయాల పట్ల చూపిస్తోన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.