హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి..డీజీపీకి వినతిపత్రం సమర్పించిన నేషనల్ హోంగార్డ్స్ అసోసియేషన్

హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి..డీజీపీకి వినతిపత్రం సమర్పించిన నేషనల్ హోంగార్డ్స్  అసోసియేషన్

ట్యాంక్‌‌‌‌బండ్, వెలుగు: తెలంగాణలో పనిచేస్తున్న హోంగార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ హోంగార్డ్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల రాజశేఖర్ సోమవారం హైదరాబాద్‌‌లోని డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా హోంగార్డులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో హోంగార్డులకు స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ ఉత్తర్వులను అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయడంతో పాటు యూనిఫాం అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పల అశోక్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.