హైదరాబాద్‎లో షాకింగ్ ఘటన: బ్లేడ్‎తో గొంతు కోసుకున్న హోంగార్డు

హైదరాబాద్‎లో షాకింగ్ ఘటన: బ్లేడ్‎తో గొంతు కోసుకున్న హోంగార్డు

జీడిమెట్ల, వెలుగు: కుటుంబ కలహాలతో ఓ హోంగార్డు గొంతు కోసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలుకు చెందిన కరీం​సూరారం సాయిబాబానగర్‎లో ఉంటూ 20 ఏండ్లుగా సైబరాబాద్​పరిధిలోని పలు ప్రాంతాల్లో హోంగార్డుగా చేస్తున్నాడు. ప్రస్తుతం  బాలానగర్ ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్‎లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా నాలుగేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కారణంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయమై కుమారులు కరీంను నిలదీశారు. 

దీంతో అతను తన పిల్లలు కొడుతున్నారని బుధవారం సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం కరీం భార్య, కొడుకులు పోలీస్​స్టేషన్‏కు వచ్చారు. మాటామాటా పెరిగి గొడవ పడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతారేమోనన్న భయంతో కరీం బ్లేడ్‎తో గొంతు కోసుకున్నాడు. పోలీసులు అతన్ని హాస్పిటల్‎కు తరలించారు. కరీంకు స్వల్ప గాయాలే అయ్యాయని వైద్యులు తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.