కేసీఆర్ వల్లే మైనార్టీల అభివృద్ధి : మహమూద్​ అలి

 కేసీఆర్ వల్లే మైనార్టీల అభివృద్ధి : మహమూద్​ అలి

జోగిపేట, వెలుగు: సీఎం కేసీఆర్​వల్లనే మైనార్టీలు అభివృద్ధి చెందారని హోమ్​మినిస్టర్​ మహమూద్​అలి అన్నారు. శుక్రవారం జోగిపేటలో జరిగిన మైనార్టీల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల పిల్లలు విద్యావంతులు కావాలని  తెలంగాణ వచ్చిన రెండేళ్లలోనే 204 మైనార్టీ గురుకుల భవనాలు నిర్మించినట్లు చెప్పారు. మైనార్టీల పిల్లలు ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళుతున్నారంటే కేసీఆర్​ పుణ్యమే అన్నారు.

యాబై ఏళ్లు పాలించిన కాంగ్రెస్​ ఏనాడు మైనార్టీల గురించి ఆలోచించలేదన్నారు.   కాంగ్రెస్​కు పొరపాటున ఓటు వేసినా మోసపోయినట్లే అన్నారు. ఆందోల్ లో ఐదేళ్లకోసారి వచ్చే లీడర్​ కావాలా ఎప్పుడూ మీ మధ్యన ఉండే లీడర్ కావాలో  తేల్చుకోవాలన్నారు. క్రాంతికిరణ్​ ఎప్పుడు ఇక్కడే ఉంటాడని, ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాడని, ప్రజలు ఆయన్నే గెలిపించాలని పిలుపునిచ్చారు.

బీఆర్​ఎస్ అభ్యర్థి , ఎమ్మెల్యే క్రాంతికిరణ్​ మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్​ మైనార్టీల స్థితిగతులు మార్చినట్లు చెప్పారు. కేసీఆర్​పాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి గొడవలకు తావివ్వలేదన్నారు. తాను గెలిచాక మైనార్టీల కాలనీల్లో సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ  చైర్​  పర్సన్​ మంజూశ్రీ,  ట్రేడ్​ ప్రమోషన్​ చైర్మన్​ భిక్షపతి, జగన్మోన్​రెడ్డి, నారాయణ, అర్పత్​, లాయక్​పాల్గొన్నారు.