ఈఎస్ఐ డిస్పెన్సరీ  మంజూరు చేసిన మంత్రి

ఈఎస్ఐ డిస్పెన్సరీ  మంజూరు చేసిన మంత్రి

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని కార్మికులకు ఈఎస్ఐ డిస్పెన్సరీ అందుబాటులోకి రానున్నట్లు టీజీఐఐసీ చైర్ పర్సన్  నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. కార్మిక శాఖ మంత్రి వివేక్  వెంకటస్వామి దృష్టికి ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీసుకెళ్లారని గుర్తు చేశారు. మంత్రి   స్పందించి సంగారెడ్డి పట్టణానికి ఈఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు చేశారని తెలిపారు. ఎంపీడీవో ఆఫీస్​ పక్కన వినియోగంలో లేని ఆర్అండ్ బీ క్వార్టర్ ను డిస్పెన్సరీకి కేటాయించారని చెప్పారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు అవసరమైన రిపేర్ల కోసం జగ్గారెడ్డి రూ.8 లక్షలు తన సొంత నిధులు అందించారన్నారు. 

పనులను పరిశీలించిన జగ్గారెడ్డి..

డిస్పెన్సరీ కోసం కేటాయించిన బిల్డిండ్​ రిపేర్​ పనులను ఆదివారం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి మంత్రులు వివేక్ వెంకట స్వామి, దామోదర్  రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ఆయన వెంట పీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్  కిషన్, జార్జ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేశ్  ముదిరాజ్, శ్రీహరి ఉన్నారు.