వరంగల్: వరంగల్లో విషాద ఘటన జరిగింది. నీళ్ల సంపులో వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తుండగా కెమికల్ రియాక్షన్తో ఒకరు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మరో ఇద్దరు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. వరంగల్ శివనగర్లో ఈ ఘటన జరిగింది.
రమేష్ అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో 15 ఫీట్ల నీళ్ళ సంపు నిర్మాణం చేశాడు. లోపలికి దిగి వాటర్ ఫ్రూట్ పెయింట్ వేస్తుండగా కెమికల్ రియాక్షన్తో రాము అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతనిని కాపాడేందుకు సంపులోకి దిగి ఓనర్ రమేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో రమేష్ కొడుకు దినేష్ అస్వస్థతకు గురయ్యాడు.
