హాంకాంగ్ హైరైజ్ అపార్ట్ మెంట్ టవర్స్ లో మంటలు ఆరలేదు. 24 గంటలుగా మండుతూనే ఉన్నాయి. ఏడు టవర్స్ పూర్తిగా కాలిపోయాయి. 24 గంటలుగా మంటలు అదుపులోకి రాక పోవటం అనేది అందర్నీ భయాందోళనలకు గురి చేస్తుంది. మంటల్లో నాలుగు టవర్స్ పూర్తిగా కాలిపోయాయని.. వాటిని కూల్చేయటమే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరో మూడు బిల్డ్సింగ్స్ ఇంకా మండుతూనే ఉన్నాయని.. మంటలు అదుపులోకి రావటం లేదని హాంకాంగ్ ఫైర్ సిబ్బంది వెల్లడించారు.
ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బందితో సహా 44 మంది మృతిచెందారు. ఇంకా 279 మంది ఆచూకీ లేకుండా పోయారు. 68 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న ఓ మహిళను రెస్క్యూటీం సాహసించి కాపాడారు.
ప్రమాదం జరిగిన అపార్టుమెంటు టవర్స్ లో ఎనిమిది నివాస భవనాలు జూలై 2024 నుంచి మరమ్మతులు చేస్తున్నారు. వీటిని వెదురు స్కాఫోల్డింగ్ , ఆకుపచ్చ మెష్‌తో కప్పి ఉంచారు. భవనాల్లో స్టైరోఫోమ్ పదార్థం ఉండటంలో మంటలు వేగంగా వ్యాపించి ఆస్థి , ప్రాణం నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. ఏవరైనా దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు అక్కడి అధికారు. హైరైజ అపార్టుమెంట్ టవర్స్ రీకన్ స్ట్రక్షన్ పనుల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. హౌసింగ్ ఎస్టేట్ నడుపుతున్న మేనేజ్‌మెంట్ సంస్థ ఆఫీసుల్లో పోలీసులు సోదా చేస్తున్నారు.
ఈ అపార్టుమెంటులో మొత్తం ఎనిమిది భవనాలుండగా.. ఏడు భవనాల్లో మంటలు వ్యాపించాయి. అయితే ఘటన జరిగి పది గంటల తర్వాత గురువారం తెల్లవారు జామున నాలుగు భవనాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. మరో మూడు భవనాలు ఇంకా మండుతూనే ఉన్నాయి.
ఈ అగ్నిప్రమాదాన్ని భారీ విపత్తు గా హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ అన్నారు. డిసెంబర్ 7 ఎన్నికలకు ముందు ఈ ప్రమాదం జరగడంతో ఎన్నికల ప్రచారం నిలిపివేశారు. ఎన్నికలను వాయిదా పడే అవకాశం ఉంది.
