బీజింగ్/హాంకాంగ్: హాంకాంగ్‌లోని ఏడు హైరైజ్ బిల్డింగ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 146కి పెరిగింది. ఇంకా 150 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మంటలను పూర్తిగా ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది.. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వరుసగా ఐదు రోజూ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు, అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏడు బిల్డింగుల్లోని 1,984 అపార్ట్‌మెంట్లలో దాదాపు 4,600 మంది నివాసితులు ఎలా మంటల్లో చిక్కుకున్నారని అనే విషయాలపై విచారణ చేపట్టారు. ఈ బిల్డింగుల్లోని ఫైర్ అలారమ్స్ సమయానికి మోగకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు వెల్లడించారు. ఈ క్రమంలో చైనాలో ఉన్న మొత్తం హైరైజ్ రెసిడెన్షియల్, పబ్లిక్ బిల్డింగ్స్‌లో ఫైర్ సిస్టమ్ పని తీరును చెక్ చేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది.
