రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సన్మానం

రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సన్మానం

వరంగల్ అర్బన్: రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి హన్మకొండలోని SCR గార్డెన్స్ లో ఆత్మీయ సన్మానం జరిగింది. ఆదివారం జరిగిన ఈసభలో… పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని MLAలు, MPలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దయాకర్ రావు మాట్లాడుతూ..  ఉద్యమకారుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి రైతు సమన్వయ సమితి చైర్మన్ గా సీఎం కేసీఆర్ సరైన గౌరవం కట్టబెట్టారని అన్నారు.

రాష్ట్రం వచ్చాక రైతుల పరిస్థితి మొత్తం మారిపోయిందని అన్నారు దయాకర్ రావు. ఐదేళ్లలో రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి మొత్తం మారిపోయిందని..  రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన మొగోడు కేసీఆర్ అని ఆయన అన్నారు. గతంలో.. srsp ద్వారా సంవత్సరానికి పదిరోజుల నీళ్ళు వస్తే ఆ నీళ్లకోసం రైతులు కొట్టుకునేదని… ఇప్పుడు కాలువలు, చెరువుల్లో కాళేశ్వరం జలాలు మత్తడి పడుతున్నాయని చెప్పారు. రైతులకు వసతులతో పాటు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే పత్తికి గిట్టుబాటు ధరలు లభించడం లేదని అన్నారు దయాకర్ రావు.  గ్రామల్లో రైతు కో ఆర్డినెటర్లే సర్పంచ్ ల కంటే పవర్ ఫుల్ కాబోతున్నారని చెప్పారు.