జస్ట్ కట్​ చేస్తే 70 లక్షలా? హనీరోజ్ డిమాండ్

జస్ట్ కట్​ చేస్తే 70 లక్షలా? హనీరోజ్ డిమాండ్

టాలీవుడ్​లో వీరసింహీరెడ్డి(Veerasimha reddy) సినిమా తర్వాత హనీరోజ్(Honey rose)​ పేరు ట్రెండింగ్​గా మారింది. ఓవర్​నైట్​లో ఈ నటి కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. కానీ, ఆమె ఫేం కి తగ్గ ఆఫర్లు మాత్రం రావడంలేదు. ఇప్పటివరకు తెలుగులో ఆమె సైన్​ చేసిన సినిమాలు పట్టాలెక్కలేదు. అయినా ఈ భారీ అందాల సుందరి నిరాశపడటం లేదు. తన క్రేజ్​ను క్యాష్​ చేసుకునే పనిలో పడింది.

ఇప్పుడు ఏ షాప్​ ఓపెనింగ్​లో అయినా హనీ రోజ్​ చేత్తో రిబ్బన్​ కట్​ చేయాల్సిందే. ఇలా ఒక్కో ఓపెనింగ్​కు దాదాపు రూ.70 లక్షల దాకా చార్జ్​ చేస్తోందని టాక్​. ఆమెను చూసేందుకు జనం ఎగబడుతుండటంతో షాపు యాజమాన్యం కోరుకున్న పబ్లిసిటీ వచ్చేస్తోంది. కానీ, ఇదే హవా సినిమాల్లో కూడా చూపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్​ కామెంట్స్​ చేస్తున్నారు. హనీనీ తెరపై చూసే రోజుకోసం ఎదురుచూస్తున్నారు.