వార ఫలాలు(24 నుంచి 30వరకు).. ఈ రాశుల వారికి అదృష్టం

వార ఫలాలు(24 నుంచి 30వరకు).. ఈ రాశుల వారికి అదృష్టం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో...ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందో చూద్దాం..

 

మేషం 

కొత్త కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందవచ్చు. ప్రముఖుల నుంచి ఉపయుక్తమైన సమాచారం రావచ్చు. ఆలోచనలు అమలులో పెడతారు. అందరిలోనూ మీ నైపుణ్యతను ప్రదర్శిస్తారు. కొంత ఆస్తిలాభ సూచనలు. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. వాహనసౌఖ్యం. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులు మరింత లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఇబ్బందులు తొలగుతాయి.

వృషభం 

ఆదాయం సంతృప్తికరం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ బాధ్యతలు కష్టమైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు అధిగమిస్తారు. శుభకార్యాల నిర్వహణపై కుటుంబంలో సంప్రదింపులు. వ్యాపారులకు కొద్ది పాటి లాభాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం 

 కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది.  ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. బంధువర్గం నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాలు తుది దశకు చేరతాయి. భూ, గృహయోగ సూచనలు. వాక్పటిమతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత అనుకూల సమయం.

కర్కాటకం

కొత్త విషయాలు తెలుస్తాయి. ఎటువంటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి. వాహనసౌఖ్యం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోaపారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలత.

సింహం

ఆదాయం కొంత నిరాశ కలిగించవచ్చు. అయితే అవసరాలకు ఇబ్బంది ఉండదు. ఆప్తుల నుంచి అందిన సమాచారంతో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. దూరప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. కుటుంబ బాధ్యతలు క్లిష్టపరిస్థితుల్లోనూ సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూవివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పెట్టుబడులు సమకూర్చుకుని వ్యాపారులు ముందుకు సాగుతారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలం.

కన్య

ముఖ్య కార్యాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఆత్మీయుల సహకారం అందుతుంది. రాబడి సంతృప్తినిస్తుంది. శారీరక రుగ్మతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు సంతోషదాయకంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలమవుతాయి.

తుల 

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. భూములు, ఇళ్లు కొంటారు. అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరతాయి. అందరిలోనూ ప్రత్యేక గౌరవం, ఆదరణ పొందుతారు.  వ్యాపారులకు నూతనోత్సాహం, పెట్టుబడుల్లో అనుకూలత.  ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు 
ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం

కార్యక్రమాలు కొన్ని  ముందుకు సాగవు. మీ సలహాలను కుటుంబంలో వ్యతిరేకిస్తారు. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. రావలసిన సొమ్ము అందక నిరాశ చెందుతారు. ఆస్తి వివాదాలపై చొరవ తీసుకుంటారు. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. క్రీడాకారులు, కళాకారులకు అవకాశాలు చేజారతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.

ధనుస్సు 

కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు. ఊహించని విధంగా ఉద్యోగలాభం. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. భూ, గృహయోగాలు. రావలసిన సొమ్ము అంది  ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కీలక సమాచారం. రాజకీయవేత్తలు, క్రీడాకారుల కృషి ఫలించే సమయం.

మకరం 

కొత్త వ్యక్తుల పరిచయం. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఇళ్లు కొంటారు. కోర్టు వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. కుటుంబసభ్యుల సాయం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారుల ఊహలకు తగినట్లుగా లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు అదనపు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

కుంభం 

కొత్త కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి. సమాజంలో  కీర్తిప్రతిష్టలు దక్కుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల పట్టుదలతో కొత్త అవకాశాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. రావలసిన సొమ్ము అందుకుంటారు. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుకుంటాయి. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి.

మీనం 

కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. కొందరు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మర ం చేస్తారు. వ్యాపారులు ఊహించని విధంగా లాభపడతారు. ఉద్యోగులకు సంతోషదాయకమైన కాలం. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఊహించని అవకాశాలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400