హైదరాబాద్లో దారుణం.. భార్య చున్నీతో నిద్రపోతున్న భర్త చాప్టర్ క్లోజ్

హైదరాబాద్లో దారుణం.. భార్య చున్నీతో నిద్రపోతున్న భర్త చాప్టర్ క్లోజ్

హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మహమ్మద్ ఇషాక్ (35) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇషాక్ నిద్రలో ఉండగా చున్నీతో గొంతు బిగించి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇషాక్ మద్యపానం కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో భార్య నూర్ జహాన్ బేగం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

మంచిర్యాల జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రతి రోజు వేధిస్తున్నాడని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం శాంతినగర్​కు చెందిన ఎండీ మోహిన్(42)ను అతని భార్య హత్య చేసింది. వివరాలిలా ఉన్నాయి. డ్రైవర్గా పని చేసే మోహిన్, సుక్కల అవంతి పదేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరిద్దరి మధ్య తరచూ డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. అవంతి కోపంతో మోహిన్​ మెడపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మందమర్రి టౌన్​ ఎస్సై గోపతి నరేశ్​ తెలిపారు.