ఓయూ హాస్టల్స్కు కరెంట్ కట్.. రోడ్డుపై విద్యార్థుల వంటావార్పు

ఓయూ హాస్టల్స్కు కరెంట్ కట్.. రోడ్డుపై విద్యార్థుల వంటావార్పు

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. హాస్టల్స్ కు కరెంట్ సరఫరా నిలిపేయడంతో స్టూడెంట్స్ అందరూ రోడ్డుపై బైఠాయించారు. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై వంటవార్పు చేస్తూ నిరసన చేపట్టారు. నిన్న మధ్యాహ్నం నుండి విద్యార్థులు ధర్నాచేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఓయూ వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నరు.

గ్రూప్ 1 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో కరెంట్, నీటి సరఫరా నిలిపివేసి హాస్టల్స్ ఖాళీ చేయించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓయూ సెమిస్టర్ పరీక్షలు పూర్తికావడంతో యూనివర్సిటీ యాజమాన్యం ఈ నెల 26 వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. అయినా విద్యార్థులు హాస్టల్స్ లో ఉండటంతో అధికారులు కరెంట్ కట్ చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన విద్యార్థులు వీసీ వచ్చి సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తేలేదని తెగేసి చెబుతున్నారు.