
మాదాపూర్, వెలుగు: హాస్టళ్ల వద్ద పార్క్ చేసిన బైక్లను చోరీ చేస్తున్న ఇద్దరిని మాదాపూర్పోలీసులు అరెస్ట్చేశారు. సీఐ కృష్ణమోహన్తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఒర్సు వెంకట్(19) బోరబండలో నివాసం ఉంటూ సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. ఇతని స్నేహితుడు జీవన్(18) ఆఫీస్ బాయ్. ఇద్దరూ కలిసి జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీ మనీ కోసం బైక్ దొంగతనం చేయాలనుకున్నారు.
ఐటీ కారిడార్లోని హాస్టళ్ల ఎదుట పార్క్చేసిన ద్విచక్రవాహనాల హ్యాండిల్ లాక్ లను బ్రేక్ చేసి వాటిని ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు. మంగళవారం పర్వత్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా వెంకట్, జీవన్తాము దొంగిలించిన వాహనంపై వెళ్తూ పట్టుబడ్డారు. విచారణలో బైక్లు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 5 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకొని, ఇద్దరినీ అరెస్ట్చేసినట్లు సీఐ తెలిపారు. వెంకట్ పై హాస్టల్స్ లో ల్యాప్టాప్లు, ఫోన్ల చోరీ కేసులున్నాయని, వెంకట్, జీవన్ పై మాదాపూర్ పీఎస్పరిధిలో మూడు, ఎస్ ఆర్ నగర్ ఠాణా రెండు బైక్దొంగతనాల కేసులున్నాయని పేర్కొన్నారు.