భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్లు & ప్రాజెక్ట్ ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బి.టెక్. పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమై మార్చి 24న ముగుస్తుంది.
ఖాళీలు: 18.
విభాగాల వారీగా ఖాళీలు: ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ 6, ప్రాజెక్ట్ ఇంజినీర్–I 12.
ఎలిజిబిలిటీ
ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఐదేండ్ల పని అనుభవం ఉండాలి .
ప్రాజెక్ట్ ఇంజినీర్–I: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/ సైబర్ సెక్యూరిటీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేండ్ల పని అనుభవం ఉండాలి .
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్ల అనుభవం ఉండాలి .
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 10.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.400.
లాస్ట్ డేట్: మార్చి 24.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు bel-india.in వెబ్సైట్ను సందర్శించండి.
►ALSO READ | ICAR-IARIలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. ఇంటర్వ్యూతో సెలెక్షన్!
