నిర్మల్ జిల్లాలో పెళ్లి వాహనం బోల్తా: 15 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

నిర్మల్ జిల్లాలో పెళ్లి వాహనం బోల్తా: 15 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తోన్న బొలెరో పికప్ వాహనం కొండాపూర్ బైపాస్ దగ్గర బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఐచ్చోడ మండలం సోన్‎పల్లి నుంచి పెళ్లికి ఆర్ముర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

బొలెరో పికప్ వాహనం వెనుక టైర్ పేలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.