ఎందుకీ డిమాండ్ అంటే : ముంబైలో ఒక్క రోజు హోటల్ గదికి లక్షల్లో రెంట్..

ఎందుకీ డిమాండ్ అంటే : ముంబైలో ఒక్క రోజు హోటల్ గదికి లక్షల్లో రెంట్..

ముంబై సిటీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా.. ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి.. జూలై 12వ తేదీన జియో వరల్డ్ లో అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి దేశంలోని ప్రముఖులే కాకుండా.. ప్రపంచ దేశాల నుంచి అతిధులు తరలివస్తున్నారు. ఈ పెళ్లి కంటే ముందే.. ముంబై సిటీలోని లగ్జరీ హోటల్స్ అన్నీ బుక్ అయ్యాయి. అలా ఇలా కాదు.. రెగ్యులర్ గా 20 వేలు, 30 వేల రూపాయలు ఛార్జ్ చేసే హోటల్స్ అన్నీ.. ఇప్పుడు రేట్లు పెంచేశాయి. 

ఏకంగా ఒక్క రోజుకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాయి. డిమాండ్ ఉన్నప్పుడే కదా బిజినెస్ చేసేది అని హోటల్ నిర్వాహకులు ఓపెన్ గా చెబుతున్నారు. జూలై 11వ తేదీ నుంచి 17వ తేదీ ముంబై సిటీలోని అన్ని లగ్జరీ హోటల్స్ లోని రూమ్స్ అన్నీ బుక్ అయ్యాయి. ఓ స్టార్ హోటల్ లోని ప్రెసిడెంటల్ సూట్ అయితే.. ఒక్క రోజు అద్దె ఏకంగా 5 లక్షల రూపాయలు పలుకుతుంది. అది మామూలు రోజుల్లో లక్ష రూపాయలు మాత్రమే అంట..


సాధారణ రోజుల్లో రూ.13వేలు వసూలు చేసే హోటల్స్ ఇప్పుడు డిమాండ్ ను బట్టీ ఒక్క రాత్రికే రూ.91వేలు అని బోర్డులు పెట్టేశారు. సోఫిటెల్ ముంబై ఒక్కరోజుకే రూ.66వేలు వసూలు చేస్తోంది. ITC గ్రాండ్ సెంట్రల్ లో రూ.25 వేలు, నారిమన్ పాయింట్, ఒబెరాయ్ ముంబై, తాజ్ ది ట్రీస్ వంటి హోటల్లో బుకింగ్స్ ఖాళీ లేవు. జూలై 17 వరకు అన్ని హోటల్స్ లో బుకింగ్స్ అయిపోయాయి. 

చిన్న పాటి ఫైవ్ స్టార్ హోటల్స్ లో రూమ్స్ కోసం వచ్చే వారు ప్రయత్నిస్తున్నారు.  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు దగ్గరలో ఉండే హాలిడే ఇన్  హోటల్ లో ఒక్క రోజుకే రూ.20 వేలు రెంట్ వసూలు చేస్తున్నారు. మొత్తానికి అంబానీ కొడుకు పెళ్లికి ముంబై హోటళ్లు బానే సొమ్ము చేసుకుంటున్నాయి. లగ్జరీ హోటల్స్ లో మాత్రం ఇప్పటికే అన్నీ రూమ్స్ బుక్ అయ్యాయి. ఆయా తేదీల్లో హోటల్ లో ఖాళీ లేదని బయట బోర్డు కూడా పెడుతున్నాయి..