హోటల్ సెకండ్ వైఫ్..ఇక్కడ భోజనంతో పాటు..

హోటల్ సెకండ్ వైఫ్..ఇక్కడ భోజనంతో పాటు..

భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు  యజమానులు విభిన్న  పేర్లను పెడుతుంటారు. డిఫరెంట్‌ థీమ్స్‌తో, క్యాచీ నేమ్స్‌తో పాటు..నవ్వులు పూయించే విధంగా పేర్లు పెడుతూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.  తాజాగా ఇలాంటి పేరుతో ఓ హోటల్ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆ హోటల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

రాజస్థాన్ రాష్ట్రంలోని ఝుంజును పట్టణంలో వారిస్‌పురా రోడ్డులో హోటల్ సెకండ్ వైఫ్ పేరుతో ఓ రెస్టారెంట్ ఉంది. ఈ పేరుతో ఉన్న ఆ  హోటల్ ఫుల్ ఫేమస్  అయింది. ఝుంజునులో ఈ హోటల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భోజనంతో పాటు..ఇతర స్నాక్స్ చాలా రుచుగా ఉంటాయి. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఈ హోటల్ను నిర్వహిస్తున్నారు. 

 సెకండ్ వైఫ్ పేరుతో నిర్వహిస్తున్న హోటల్ గతంలో టిఫిన్ సెంటర్‌గా ఉండేది. ఆ టిఫిన్ సెంటర్ను సుమన్ దేవి అనే మహిళ ప్రారంభించింది.  టిఫిన్ సెంటర్ నడుపుతూ తన కొడుకులు  సంజయ్, కృష్ణలకు నేర్పించింది. అయితే కొన్నేళ్ల పాటు టిఫిన్ సెంటర్గా ఉన్న ఈ హోటల్ ను అన్నదమ్ములు కలిసి హోటల్గా అభివృద్ధి చేశారు. 

భోజనం కేవలం రూ. 80 మాత్రమే

హోటల్ సెకండ్ వైఫ్ రెస్టారెంట్ లో పూర్తి భోజనం రూ. 80 మాత్రమే. వివిధ కూరగాయలను కూడా ప్రజలకు ఉచితంగా అందిస్తారు. గతంలో వారు ఎలాంటి టిఫిన్ అయినా కేవలం రూ. 50 కే అందించేవారు. ఝుంజును నగరం మొత్తంలో ఈ  హోటల్‌లో మజ్జిగ రబ్రీ ఫుల్ ఫేమస్. 

సెకండ్ వైఫ్ పేరు ఆలోచన ఎలా..

టిఫిన్ సెంటర్ నడిపే సమయంలో సుమన్ దేవి కొడుకు కృష్ణ ..టిఫిన్ ఆర్డర్ చేసిన వారికి  డెలివరీ చేసేవాడు. చాలా మంది భర్తలు తమ భార్యలు పుట్టింటికి వెళ్లినప్పుడు తమ టిఫిన్ ను ఆర్డర్ చేసేవారని కృష్ణ చెప్పాడు. ఆ సమయంలో టిఫిన్ డెలివరీ చేసినప్పుడు భర్తలు  తమ టిఫిన్ సెంటర్ ను వారి రెండో భార్యగా భావించేవారని..టైంకు టిఫిన్ పెడుతుందని ప్రశంసించేవారని గుర్తు చేశాడు. ఆసమయంలోనే తాను అనుకున్నానని..హోటల్ పెడితే దాని పేరును హోటల్ సెకండ్ వైఫ్ గా నామకరణం చేద్దామని..ఇప్పుడు తన కల నెరవేరిందని కృష్ణ చెప్పుకొచ్చాడు.