60 యేళ్ల నాటి బ్యాంక్ పాస్బుక్.. అతన్ని రాత్రికి రాత్రే మిలియనీర్ చేసింది..ఎలాగంటే..

60 యేళ్ల నాటి బ్యాంక్ పాస్బుక్.. అతన్ని రాత్రికి రాత్రే  మిలియనీర్ చేసింది..ఎలాగంటే..

కొందరి అదృష్టం రాత్రికి రాత్రే మారిపోతుంది. ఊహించని విధంగా వారి జీవితాల్లో సంపద వచ్చి పడుతుంది. సరిగ్గా అలాంటిదే ఓ వ్యక్తి జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేసింది. ఎప్పుడో చనిపోయిన తండ్రి పాత వస్తువులను పరిశీలిస్తున్నప్పుడు అతనికి అదృష్టం వరించింది. తండ్రి పాత ట్రంక్ పెట్టెను వెతుకుతున్న కొడుక్కి ఊహించని సిరిని తెచ్చిపెట్టింది.అతను కలలో కూడా ఊహించలేదు.. ఇలా రాత్రికి రాత్రే మిలియనీర్ అయిపోతాడని.. ఒక్కసారిగా వచ్చి పడిన సంపదను చూసి అతను ఆశ్చర్యంతో పాటు ఆనందంతో గంతులు వేశాడు.. వివరాల్లోకి వెళితే.. 

అది 1960లో  తీసిన బ్యాంక్ పాస్ బుక్..  60 యేళ్ల చరిత్ర ఉంది దానికి.. తీసిన వ్యక్తి చనిపోయినా.. కుటుంబ సభ్యులు గమనించకపోవడంతో ట్రంక్ పెట్టెలో 60 యేళ్లుగా అలాగే ఉండిపోయింది. ఇటీవల బ్యాంక్ ఖాతా తెరిచిన వ్యక్తి కి సంబంధించిన వస్తువులను అతని కుమారుడు పరిశీలిస్తుండగా ఆ పాస్ బుక్ బయటపడింది. అయితే  పాస్ బుక్ ఉన్న బ్యాంక్ ఎప్పుడో మూత పడిపోయింది. కానీ దానిలో రాసివున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతని కుమారుడిని మిలియనీర్ ని చేసింది. 

చీలీకి చెందిన హీనోజోషా అనే వ్యక్తికి తండ్రి ఇల్లు కొనుగోలు చేసేందుకు 60 యేళ్ల క్రితం ఓ బ్యాంకులో ఖాతా తెరిచి డబ్బులు  దాచుకున్నాడు.. ఈ విషయం కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియదు.. అయితే హీనోజోషా తండ్రి ఇటీవల కాలంలో చనిపోయాడు. తండ్రికి సంబంధించిన వస్తువులు ఇంట్లో మూలన ఉండటంతో హీనో జోషా పరిశీలించసాగాడు. వాటిలో దశాబ్ధాలనాటి తన తండ్రికి సంబంధించిన ఆ బ్యాంక్ పాస్ బుక్ కనిపించింది. మొదట్లో ఈ పాస్ బుక్ వల్ల ఏమి ఉపయోగం ఉంటుందని తేలిగ్గా తీసుకున్నారు హీనోజోషా.. కానీ ఆ పాస్ బుక్ లోని టర్మ్స్ అండ్ కండిషన్స్ అతనికి ఊహించని సంపద తెచ్చి పెట్టాయి. 

ఆ బ్యాంక్ పాస్ బుక్ లో ఏముందంటే.. ఒక వేళ బ్యాంకు గనక దివాళ తీసినా.. మూసివేసినా.. స్థానిక ప్రభుత్వం ఆ డబ్బులను ఖాతాదారునికి చెల్లించాలని రాసి ఉంది. దీంతో  హీమోజోషా లీగల్ గా ప్రొసీడ్ అయ్యాడు. మొదట్లో కింది కోర్టులన్నీ చెల్లదు అని చెప్పినా.. అక్కడి సర్వోన్నత న్యాయస్థానం మాత్రం హోమోజోషాకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. 

Also Read: పులి దాడిలో ఆవు దూడ మృతి

60 యేళ్ల ఆ పెద్దాయన దాచుకున్న డబ్బు వాల్యూ.. లక్షాల 40వేల పపోస్..  ఇప్పుడు1మిలియన్ పపోస్ లు అంటే.. దాదాపు 1.2 మిలియన్ డాలర్లు.. మన ఇండియన్ కరెన్సీలో 8.22 కోట్లు. తండ్రి మరణం తర్వాత అతని వస్తువులు పరిశీలిస్తున్న అతనికి ఇంత భారీ ఎత్తున్న సంపద వచ్చి పడుతుందని హీమోజోషా ఊహించలేదు.. ఏదేమైనప్పటికీ హీమో జోషా తండ్రి ఇచ్చిన సంపాదనతో హ్యాపీగా ఉన్నాడు.