Abhijeet Dipke: ఒక్క సోషల్ మీడియా పోస్ట్ దేశ రాజకీయాలనే తిరగరాస్తుందని ఎవరైనా ఊహించారా? కానీ, అదే నిజమైంది! కేవలం ఆరు పదాలతో పెట్టిన ఒక పోస్ట్.. లక్షలాది మంది యువతను ఏకం చేసి, ఏకంగా ఒక కేంద్ర మంత్రినే పదవి నుంచి దిగిపోయేలా చేసింది. సోషల్ మీడియాలో మొదలై ఢిల్లీ వీధుల్లో తుఫానులా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP), దాని వెనుక ఉన్న యంగ్ లీడర్ అభిజీత్ దీప్కే ట్రెండింగ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
దేశాన్ని షేక్ చేసిన ఆ 6 పదాల పోస్ట్:
మే 16న అభిజీత్ దీప్కే ఎక్స్(ట్విట్టర్) వేదికగా పెట్టిన ఒక్క ట్వీట్ సోషల్ మీడియాలో బాంబులా పేలింది. "What if all cockroaches come together?" (ఒకవేళ బొద్దింకలన్నీ ఒక్కటైతే ఏమవుతుంది?).. నిరుద్యోగ యువతను బొద్దింకలు అని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆయన ఈ సటైరికల్ పోస్ట్ చేశాడు. దీంతో NEET పేపర్ లీక్, నిరుద్యోగంతో రగిలిపోతున్న జెన్-జీ (Gen-Z) యువత ఈ పోస్ట్‌ను విపరీతంగా షేర్ చేయడంతో ఇది ఒక్కసారిగా ట్రెండ్‌లోకి వచ్చింది.
2.5 కోట్ల ఫాలోవర్లతో ట్రెండింగ్:
ఢిల్లీకి చెందిన యూట్యూబర్ తో పాటు తన స్నేహితుడు AI టూల్స్ ఉపయోగించి కాక్రోచ్ జనతా పార్టీ (CJP)తో ఒక సెటైరికల్ వెబ్‌సైట్, ఇన్‌స్టాగ్రామ్ పేజీని రూపొందించారు. దీంతో కొన్ని రోజుల్లోనే ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 2.5 కోట్ల (25 million) ఫాలోవర్లను సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. NEET పేపర్ లీకేజీలు, నిరుద్యోగంతో విసిగిపోయిన లక్షలాది మంది యువతకు ఇది ఒక ప్రధాన ఉద్యమ వేదికగా మారింది.
ఎవరు ఈ అభిజీత్ దీప్కే:
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఒక దళిత కుటుంబంలో అభిజీత్ దీప్కే జన్మించాడు. ఆయన తండ్రి తీవ్ర పేదరికంలో పెరగ్గా, తాతగారు వ్యవసాయం చేసేవారు. ఇక పూణేలో జర్నలిజం పూర్తి చేసిన అభిజీత్, 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా విభాగంలో పని చేసి మీమ్స్, సటైరికల్ కంటెంట్‌తో రాజకీయ సందేశాలు క్రియేట్ చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా 2023లో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని బాస్టన్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ రిలేషన్స్ (PR) లో మాస్టర్స్ చదివాడు.
అమెరికా నుంచి జంతర్ మంతర్ వరకు:
విద్యార్థుల ఉద్యమం తీవ్రమవడంతో జూన్ 6న అభిజీత్ బాస్టన్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆత్మకథ (My Autobiography) పుస్తకాన్ని చేతిలో పట్టుకుని జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదేశానికి చేరుకున్న ఆయన, పోలీసుల లాఠీఛార్జ్‌లకు, బెదిరింపులకు బెదరకుండా లక్షలాది మంది జెన్ జీ విద్యార్థులని శాంతియుతంగా ముందుకు నడిపించాడు.
కేంద్రానికి బిగ్ షాక్.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా:
విద్యార్థులు పెద్దెత్తున్న నిరసన తెలియజేయడంతో కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ తన పదవికి రాజీనామా చేశాడు. దాదాపుగా 26 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ పోరాటంతో దిగివచ్చిన కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన మూడు డిమాండ్లలో ఒకటి నెరవేర్చగా మరో రెండు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
విద్యార్థులను ఉద్దేశించి అభిజీత్ దీప్కే వ్యాఖ్యలు:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్రమంత్రి రిజైన్ చేయడం ఒక బిగ్ విక్టరీ! మనం భయపడకుండా, ప్రభుత్వం ముందు తలవంచకుండా నిలబడితే ఎంతటి వారినైనా పదవుల నుంచి దించవచ్చని నిరూపించామన్నారు.
ఇంకా ముగియని పోరాటం.. నెక్స్ట్ టార్గెట్ ఇవే:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం ప్రారంభం మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ క్రింది రెండు ముఖ్యమైన డిమాండ్లను నెరవేర్చాలని అభిజీత్ దీప్కే స్పష్టం చేశాడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్టూడెంట్స్‌పై దాడి చేసిన పోలీసులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నీట్ పేపర్ లీక్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే భారీ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
#WATCH | Delhi: Moment when Union Education Minister Dharmendra Pradhan resigned from his post; visuals from the protest at Jantar Mantar pic.twitter.com/6YNf9LN3bN
— ANI (@ANI) July 25, 2026
This morning, Abhijeet Dipke said he had typhoid and that he was feeling very weak.
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) July 25, 2026
Now he's happily breaking the stage in celebration.
Well, he has become a politician from today, so his happiness is justified.
As for me, I have also resigned from Jantar Mantar today. 😭🤣 pic.twitter.com/jz3W2KzoDu
