చెస్‌‌‌‌ ఇండియా బ్లిట్జ్‌‌‌‌ టోర్నీలో రెండో ప్లేస్‌‌‌‌కు అర్జున్‌‌‌‌

చెస్‌‌‌‌ ఇండియా బ్లిట్జ్‌‌‌‌ టోర్నీలో  రెండో ప్లేస్‌‌‌‌కు అర్జున్‌‌‌‌

కోల్‌‌‌‌కతా: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. టాటా స్టీల్‌‌‌‌ చెస్‌‌‌‌ ఇండియా బ్లిట్జ్‌‌‌‌ టోర్నీలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శనివారం ఓపెన్‌‌‌‌ విభాగంలో జరిగిన 9 రౌండ్లలో అర్జున్‌‌‌‌ 6.5 పాయింట్లు సాధించాడు. 

మూడు, నాలుగు, ఐదు, ఏడు, తొమ్మిది, పది గేమ్‌‌‌‌ల్లో తన ప్రత్యర్థులపై విజయాలు సాధించిన అర్జున్‌‌‌‌ ఎనిమిదో గేమ్‌‌‌‌ను డ్రా చేసుకున్నాడు. అమెరికా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ వెస్లీ సో 7 పాయింట్లతో టాప్‌‌‌‌లో ఉన్నాడు. నీహల్‌‌‌‌ సరీన్‌‌‌‌ (5.5), విశ్వనాథన్‌‌‌‌ ఆనంద్‌‌‌‌ (5), విదిత్‌‌‌‌ సంతోష్‌‌‌‌ గుజరాతీ (5), ప్రజ్ఞానంద (4) వరుసగా మూడు నుంచి ఆరో స్థానంలో ఉన్నారు. విమెన్స్‌‌‌‌ సెక్షన్‌‌‌‌లో గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ద్రోణవల్లి హారిక (4) ఏడో ప్లేస్‌‌‌‌లో ఉంది.