తమిళ చెఫ్కు న్యూయార్క్ అవార్డు

తమిళ  చెఫ్కు న్యూయార్క్ అవార్డు

చెఫ్​ విజయ్ కుమార్​ వయసు 44 ఏండ్లు. తమిళనాడులోని నాథమ్ అనే గ్రామానికి చెందినవాడు. చిన్నప్పుడు వాళ్లమ్మ, అమ్మమ్మలు వంట చేయడానికి కట్టెల కోసం అడవికి వెళ్లేవాళ్లు. కట్టెల పొయ్యి మీద వంట చేసి పెట్టేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన విజయ్ కుమార్, ఇప్పుడు ప్రముఖ చెఫ్​గా న్యూయార్క్​లోని జేమ్స్ బియర్డ్ అనే ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నాడు. ఆ అవార్డు పొందిన సందర్భంగా అతను చెప్పింది ఏంటంటే.. ‘‘ఫుడ్​ అనేది పేదలకు, ధనికులకు వేరుగా ఉండదు. ఎవరికైనా అది ఆహారమే. చాలా శక్తివంతమైనది. టేబుల్​ చుట్టూ అందరూ కలిసి కూర్చుని ఫుడ్​ని ఆస్వాదించడమే లగ్జరీ. నేను తమిళనాడులో ఒక చిన్న రూమ్​లో వంట చేయడం మొదలుపెట్టాను. చూడ్డానికి నల్లగా ఉంటా. వంట చేస్తాను అని గుర్తించేవారు. 

పెద్ద సిటీలో ఇంజనీరింగ్ చదువుకోవడానికి స్థోమత లేకపోవడంతో దానికి బదులు కలీనరీ స్కూల్​ని ఎంచుకున్నా. చెన్నైలోని తాజ్ కొన్నెమర హోటల్​లో తన జర్నీ స్టార్ట్ చేశా. అక్కడ మొదలుపెట్టిన ప్రయాణం అమెరికా వరకు వెళ్లింది”అని. క్రూయిజ్ షిప్​లలో వంట చేస్తూ కొంతకాలానికి తను కలలు కన్న అమెరికాకు వెళ్లాడు. అక్కడే శాన్​ ఫ్రాన్సిస్​కో ‘దోశ’ హోటల్​లో పనిచేశాడు. ఆ తర్వాత ‘సెమ్మా’ రెస్టారెంట్​ నడిపిస్తున్న రోని ముజుందార్, చింతన్​ పాండ్యా అనే ఇద్దరితో పార్ట్​నర్​షిప్​ చేశాడు. వాళ్లది న్యూయార్క్ రెస్టారెంట్​ గ్రూప్​లో ఒకటి కావడంతో అవార్డుల్లో పాల్గొనే అవకాశం కూడా లభించింది. ముగ్గురూ తమిళులు కావడం, వాళ్లు వండిన పదార్థాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో గర్వంగా ఫీలయ్యారు. ‘ఇది కేవలం ఫుడ్ గురించే కాదు.. ఇదొక ఐడెంటిటీ’ అని వాళ్లలో ఒకరైన ముజుందార్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

►ALSO READ | Harnidh Kaur Sodhi: చిన్న వయసులో పెద్ద సక్సెస్‌‌..! హర్నీధ్ గురించి ఆసక్తికర విశేషాలు