Good Health :ఎండాకాలం ఎక్సర్ సైజులు ఎట్ల చేయాలి.. ఎంత సేపు చేయాలి.. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..!

Good Health :ఎండాకాలం ఎక్సర్ సైజులు ఎట్ల చేయాలి.. ఎంత సేపు చేయాలి.. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..!

ఎండాకాలం బయటకు పోతే శరీరం మాడిపోతది. ఇక ఇంట్లో ఉంటే వేడికి కుక్కర్లో ఉన్నట్టు ఒళ్లు ఉడుకుతది. ఎనిమిదిగాక ముందే వెదర్ గిట్ల వేడెక్కుతున్నప్పుడు.. రోజూ చేసే వర్కవుట్ల పట్ల కొంచెం పైలంగా ఉండాలె. ఎండాకాలం వర్కవుట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నరు ఫిట్నెస్ నిపుణులు.
 
ఎండాకాలం వర్కవుట్లు చేసేటప్పుడు.. ఏం చేస్తే మంచిది? ఎట చేస్తే మంచిదో తెలుసుకోవాలి. 'ఏంకాదులే... ఎప్పుడు చేస్తున్నవే కదా' అని జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టమొచ్చినట్లు ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం దిస్క్ లో పడ్డది.

నీళ్లు తాగకుండా ఉండొద్దు

"దూపయితనే నీళ్లు తాగుతా' అనే ఫార్ములాను ఈ కాలంలో మర్చిపోవాలె.. వర్కవుట్ చేసేటప్పుడు ఉష్ణోగ్రతని నియంత్రించడానికి శరీరం నీటిని వాడుకుంటది. శరీరంలో లిక్విడ్ లెవల్స్ తక్కువగా ఉంటే కొవ్వుని వాడుకుంటది. ఆ టైంలో వర్కవుట్స్  చెయ్యాలనిపించదు. అయితే అన్ని లిక్విడ్స్ ఒక్కటే కాదని గుర్తుంచుకోవాలె. మార్నింగ్ లేస్తూనే ఓ గ్లాస్ నీళ్లు తాగితే మంచిది. కానీ వర్కపటికి ముందు కిఫీస్ స్థాయి ఎక్కువగా ఉండే కాఫీ తీసుకుంటే బాడీ ఇంకా తొందరగా డీ హైడ్రేట్ అయితరు. కాబట్టి వర్కవుట్ చేసేటప్పుడు ఎప్పుడూ వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవాలె. మధ్య మధ్యలోసిస్ చేస్తూ ఎక్సర్ సైజ్లు చేస్తుందాలి.

ఎండలో ఎక్స్ సైజ్ లొద్దు

ఎనిమిది గొట్టకముందే సూరీడు. సురుక్కుమంటుండు. కాబట్టి ఎండల ఎక్సర్సైజ్లు పెట్టుకోవద్దు. లేత కిరణాలు పడటం ఆగిపోయే లోపే అవుట్ డోర్ పద్యపుటలు ముగించాలి. లేదంటే సాయంత్రం వాతావరణం చల్లగయ్యాక చేసినా మంచిదే. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మ సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతయ్. ముఖ్యంగా భయంకరమైన మాలిగ్నెంట్ మెలనోమా క్యాన్సర్ రావొచ్చు. ఉదయం ఎనిమిది నుంచి నాలుగు గంటల మధ్య ఎలాంటి అవుట్ డోర్ ఎక్సర్ సైజ్లు చెయ్యకూడదు.

Also Read: జుట్టుకు రంగు వేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలంటే

కాబట్టి టైం చెక్ చేసుకుంట ఎక్సర్సైజ్ చెయ్యాలె. ఎత్తు ప్రదేశాలకు జాగింగ్ వద్దు కొంతమందికి కొండలపొంటి పరుగెత్తడం. అంటే ఇష్టం. అయితే ఎండాకాలంలో ఎత్తైన ప్రదేశాలకు జాగింగ్ వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే అంత ఎత్తులో ఆడ్సిజన్ స్థాయిలు తక్కువుంటయ్. ఎత్తైన కొండల్లో జాగింగ్ కి వెళ్లడం కంటే సమాంతర నేలపై లేదా ట్రెడ్ మిల్ పై జాగింగ్ చెయ్యాలి..

ఎత్తు ప్రదేశాలకు జాగింగ్ వద్దు

కొంతమందికి కొండలపొంటి పరుగెత్తడం అంటే ఇష్టం. అయితే ఎండాకాలంలో ఎతైన ప్రదేశాలకు జాగింగ్ వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే అంత ఎత్తులో అక్సిజన్ స్థాయిలు తక్కువ ఉంటాయ్. ఎతైన కొండల్లో జాగింగ్ కి వెళ్లడం కంటే సమాంతర నేలపై లేదా ట్రెడ్ మిల్ పై జాగింగ్ చెయ్యాలె.

కాలానికి తగ్గ దుస్తులేసుకోవాలె..

అవుట్ డోర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్కిన్లైట్, పాలిస్టర్ దుస్తులు వేసుకోవద్దు. వేడిని తట్టుకునేలా లూజ్ ఫిట్టింగ్, లేత రంగు దుస్తులు వేసుకోవాలె. కొద్దిసేపే వర్కవుట్ చేసే వాళ్లకయితే డాటన్ బెటరే, కానీ ఎక్కువసేపు వర్కవుట్ చేసేవాళ్లకు ఎండాకాలంలో అధిక చెమట పడుతది. వీళ్లు బ్రీతబుల్ సింథటిక్ స్పోర్ట్స్రుస్తులను ఎంచుకోవాలి. అవి చెమటని పూర్తిగా పీల్చుకుని బయటకు పంపిస్తది. దీంతోపాటు కూల్ ఫీలింగ్ ఇస్తయ్.

పెట్ డాగ్ ని తీసుకపోవద్దు

కొందరికి తమ వెంట పెంపుడు కుక్క లేకుంటే వర్కవుట్ చెయ్యబుద్ధి కాదు. మీ పెటాగ్ మీతో పాటు పరుగెడుతున్నప్పుడు మీలో ఉత్సాహం రెట్టింపు అయితుందని తెలుసు. కానీ ఇది ఎండాకాలం. అధిక వేడి, తేమ ఉన్నప్పుడు కుక్కలను బయట తిప్పడం మంచిది. కాదు. అలా మీతో పరుగెతుడున్నప్పుడు. కుక్కల్లో ఎక్కువ ఉష్ణోగ్రత పుడుతది. ఇది దాని ప్రాణాల మీదకు తేవచ్చు. కాబట్టి ఎండాకాలంలో మీ పెలాగ్ ని ఇంటి దగ్గరే వదిలిపోవాలి.

ఎలక్ట్రోలైట్లు ఉండేలా చూసుకోవాలె

అధిక వేడి, ఉక్కపోతతో చెమట విపరీతంగా వస్తది. చెమట ఎక్కువగా బయటకుపోవడాన్నే 'ఎలక్ట్రోలైట్ లాస్' అంటరు. ఎలక్ట్రోలైట్ లాస్ ఎక్కువ ఉంటే తలనొప్పితో పాటు వాంతులైతయ్. కేవలం నీళ్లు తాగితే ఎలక్ట్రోలైట్లు శరీరానికి అందవు. కాబట్టి సోడియం ఉండే పానీయాలు తాగాలి. దీనికి కృత్రిమ సోడియం పానీయాలపై ఆధారపడటం మంచిది కాదు. కొబ్బరినీళ్లు, చెర్రీ, జ్యూస్, చాకొలెట్ మిల్క్ వంటివి తాగాలి. 

కొంచెం వేగం తగ్గించాలె

ఎనిమిది నిమిషాలకు కిలోమీటరున్నర పరిగెత్తితే.. అంతే దూరానికి ఎండాకాలంలో ఇరవై నిమిషాలు తీసుకోవాలె. ఎండాకాలంలో ఉండే ఉష్ణోగ్రత వల్ల ఏసీజన్లో ఎనిమిది నిమిషాలు.. అవుట్ డోర్లో ఇరవై నిమిషాలకు సమానంగా శక్తి ఖర్చవుతుంది. దీనికి తగ్గట్టుగా జాగింగ్ని ప్లాన్ చేసుకోవాలి. మునపటి దూరమే లక్ష్యంగా పరుగెత్తాలి. కానీ గమ్యం చేరుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటే మంచిది.

టెంపరేచర్ చెక్ చేసుకోవాలె

చలికాలంలో ఎంత చలి ఉంది.. గాలిలో ఎంత తేమ ఉందో తెలుసుకున్నంకనే అవుట్డోర్ జాగింగ్ లేదా వర్కవుట్స్ చెయ్యడానికి వెళ్లరు చాలామంది. ఎండాకాలంలో మాత్రం అట్ల చెయ్యరు. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల మొబైల్లోనే టెంపరేచర్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు టెంపరేచరి ని చెక్ చేసుకుంటే...'ఈ రోజు ఎట్ల ఎక్సర్సైజ్ చేయాలి' అన్నది ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.

శరీర సూచనల్ని వినాలి

నిజానికి ప్రకృతిలో వచ్చే మార్పులు ఆధారంగా శరీరం కొన్ని సూచనలు. ఇస్తది. సమ్మర్లో కొద్దిసేపు వర్కవుట్ చెయ్యాగానే అలిసిపోయ్యామనే ఫీలింగ్ కలుగుతది. ఎక్సర్సైజ్ చెయ్యాలన్నా. బద్ధకంగా అనిపిస్తది. శరీరం ఇచ్చే ఈ సూచనలను పట్టించుకోకుండా అలాగే ఎక్సర్సైజ్ కంటిన్యూ చెయ్యెడు. అలాంటి ఫీలింగ్ కలిగిన వెంటనే ఎడ్వర్ సైజ్ ఆపెయ్యాలి.