Beauty Tips : జుట్టుకు రంగు వేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలంటే..!

Beauty Tips : జుట్టుకు రంగు వేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలంటే..!

జుట్టు నల్లగా ఉండటం కంటే రకరకాల రంగుల్లో ఉండటం ట్రెండ్ ఇప్పుడు. యూత్ ట్రెండ్ ను ఫాలో అవుతూ రంగు వేసుకుంటుంటే, వయసు మీదపడినోళ్లు తెల్లజుట్టు దాచేందుకు వేసుకుంటున్నారు. కారణం ఏదైనా.. ఎక్కువమంది జుట్టుకు రంగు వేయడం మామూలై పోయింది. మరి ఏ రంగు వేసుకోవాలి? ఎలా వేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ..

కొందరు సెలూన్, బ్యూటీ పార్లర్లకు వెళ్లి నచ్చిన రంగును జుట్టుకు వేయించుకుంటు న్నారు. కానీ తమకు ఆ రంగు నప్పుతుందా లేదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా.. అని ఆలోచించడం లేదు. మరి కొందరైతే జుట్టు నల్లగా ఉంటే చాలని, ఇంట్లోనే అర్ధం ముందు కూర్చొని సొంతంగా రంగు వేసుకుంటున్నారు. కానీ, జుట్టుకు రంగులు వేసుకునే వాళ్లలో 42 శాతం మందిపై అది చెడు ప్రభావం చూపుతుందని ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. 

రంగుల తిప్పలు

ట్రెండీలుక్ కోసం తగిన జాగ్రత్తలు తీసు కోకుండా జుట్టుకు రంగు వేసుకుంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. జుట్టుకు వేసుకునే రంగును, ప్యార్ టెస్ట్ చేసుకున్నాకే వాడాలి. ఇందుకోసం ముందే చేతిమీద రంగు కొంచెం రాసుకుని పది నుంచి పదిహేను నిమిషాలు చూడాలి. తర్వాత ఎలాంటి ఎఫెక్ట్ చూపకపోతే వెంట్రుకులకు వేసుకోవాలి. ముఖ్యంగా రంగుల్లో వాడే అమ్మోనియా, ప్రోస్టియన్, గ్లైకోల్, పిపిడి లాంటి కెమికల్స్ వల్ల అలర్జీ లు వచ్చే అవకాశం ఉంది. ఆ రసాయనాలు చర్మానికి తగలడం వల్ల, జుట్టు కుదుళ్లకు పట్టుకోవడం వల్ల చర్మసంబంధమైన వ్యాధులు రావచ్చు. అలాగే కొన్ని రసాయ నాల వల్ల వెంట్రుకలు పొడిబారి, బలహీన పడతాయి.

Also Read : నాడుల ఆరోగ్యం కోసం ఈ యోగా చేయండి..!

దాంతో వెంట్రుకలు తొందరగా ఊడిపోయే ప్రమాదం ఉంది. రంగు వేసుకునేటప్పుడు కళ్లలోకి పోతే చూపుకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. ఎక్కువసార్లు రంగు వేసుకునే వాళ్లకు క్యాన్సర్ ఆస్తమా లాంటి వ్యాధులు వచ్చే ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

జాగ్రత్త

చాలామంది జుట్టుకు సొంతంగా రంగు వేసుకుంటారు. లేదా ఇంట్లోవాళ్లతో వేయించుకుంటారు. ఇలాంటి వాళ్లలో చాలామందికి ఏ రంగు వేసుకోవాలో, తమ శరీరానికి, ముఖానికి ఎలాంటి రంగు నప్పుతుంతో తెలియదు. జుట్టు నల్లగా ఉంటే చాలనుకుంటారు. కానీ జుట్టు రంగు సహజంగా కనిపించాలంటే ముదురు రంగుల కంటే, లేతరంగులే మంచిదం టున్నారు నిపుణులు. ఒక్కోసారి రంగు వేయడం ఆలస్యం అయితే జుట్టు కుదుళ్ల దగ్గర వెంట్రుకలు తెల్లగా కనిపిస్తాయి. కొందరు అక్కడి వరకే రంగు వేస్తారు. అందువల్ల జుట్టులో కొంత ఒకరంగులో మరికొంత మరో రంగులో కనిపిస్తుంది. అలా కాకుండా జుట్టు అంతా ఒకే రంగులో కనించేలా రంగు వేసుకోవాలి. రంగు వేసు కునేటప్పుడు జుట్టు అంతా అంటుకుందా లేదా అని చెక్ చేసుకోవాలి. లేదంటే తలపై రంగు ప్యాచుల్లా కనిపిస్తుంది. రంగు చర్మా నికి అంటుకోకుండా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకోవాలి.

ముందు...

వెంట్రుకలు శుభ్రంగా లేకపోతే రంగు సరిగా అంటుకోదు. అందుకే. జుట్టుకు రంగువేసే ముందు శుభ్రం చేసుకోవాలి. తలపై దురద, గాయం లాంటివి ఉంటే డై వేయకూడదు. ఎలాంటి కలర్ అయినా జు ట్టుకుదుళ్లను దెబ్బతీస్తుంది. కొసలు చిట్లేలా చేస్తుంది. అందుకే కటింగ్ చేయించాక డై వేయించుకుంటే మంచిది, స్ట్రెయిటనింగ్, వర్మింగ్ లాంటివి చేయించిన వెంటనే రంగు వేయకూడదు. కనీసం రెండు వారాలన్నా ఆగాలి. లేదంటే వెంట్రుకలు సహజత్వాన్ని కోల్పోతాయి. హెన్నా, ఇతర ఏదో ఒకటే వాడాలి. ఎందుకంటే హెన్నా వాడిన తర్వాత వేసుకుంటే రంగు వెంట్రు కలకు పట్టుకోదు. కొత్త బ్రాండ్ వాడాలంటే తప్పనిసరిగా హెయిర్ ఎక్స్పర్ట్ను కలిసి సలహా తీసుకోవాలి. కలర్ వేసుకునే ముందు చేతులకు క్షౌజులు వాడటం మంచిది.

తర్వాత..

జుట్టుకు వేసుకున్న రంగు ఎక్కువకాలం ఉండాలంటే హార్ట్, యాంటీ డేండ్రఫ్ షాంపూలు వాడకూడదు. సల్ఫేట్ లేని షాంపూలు వాడటం మంచిది. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న కండీషనర్ వాడాలి. ఇది జట్టును గట్టి పరుస్తుంది. రంగు పోకుండా కాపాడుతుంది. రంగులు వేసు కున్నవాళ్లు డ్రైయ్యర్ వాడకూడదు. అది జుట్టు పొడిబారేలా చేస్తుంది. రంగులు వేసుకునే వాళ్లు హెయిర్ ప్యాక్ విష యంలోనూ జాగ్రత్తగా ఉండా లి. అలాగే వారంలో ఎక్కువసార్లు తలస్నానం చేయడం మంచిది కాదు. రెండు సార్ల న్నా మించి తలస్నానం చేయకపోవడమే ఉత్తమం.

క్లోరిన్ తక్కువగా ఉన్న నీళ్లతో స్నానం చేయాలి. జుట్టు పొడిబారిపోతే హెయిర్ సీరమ్ వాడొచ్చు. తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనె పట్టిస్తే, రంగు పోకుండా జుట్టుకు అంటిపెట్టుకుని ఉంటుంది. అయితే ఎప్పుడూ ఒకే రంగు కాకుండా, రంగు మార్చాలనుకునే వాళ్లు జుట్టును పొడిగా ఉంచుకోవాలి. అలాగే నిపుణుల సలహా తప్పకుండా. తీసుకోవాలి.

సహజ రంగులే మంచివి.

రసాయనాలతో కూడిన హెయిర్టెలు వేయడం కంటే, ప్రకృతిలో సహజంగా దొరికే వాటిని వాడటం మంచిది. సహజరంగు ఒక్కసారి వాడితే మళ్లీ రెండు నెలల వరకు జుట్టు రంగు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వెంటనే అవి పోవు. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కూడా రావు. గోరింటాకు, అలోవెరా, మందారం ఆకులు, వాటి పువ్వులు, ఉసిరి..లాంటి వాటిని నేరుగా లేదా పొడి చేసి, నీళ్లు కలిపి జుట్టుకు పెట్టుకోవచ్చు. వీటివల్ల జుట్టు రంగు మారినా, ఆరోగ్యంగా ఉంటుంది. కుదుళ్లు బలంగా ఉంటాయి.

ఎలాంటి సమస్యలు రావు.. తలకు మంచిది

హెన్నా పౌడర్ ను...
ఆముదంలో మరిగించి, చల్లారాక జుట్టుకు పెట్టుకుని, రెండు గంటల తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టుకు నిగారింపు వస్తుంది. కాఫీ పొడిని నీళ్లలో కలిపి వేడిచేసి, సైబాటిల్లో పోసి జుట్టు కుదుళ్లకు అంటేలా తలంతా స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత మసాజ్ చేయించుకుని, తలస్నానం చేస్తే జుట్టు నల్లగా, అందంగా కనిపిస్తుంది. అలాగే బ్లాక్ట పౌడర్ ని నీటిలో మరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి, గంట సేపు అయ్యాక తలస్నానం చేసినా జట్టు నల్లగా మారుతుంది.