Good Health : నాడుల ఆరోగ్యం కోసం ఈ యోగా చేయండి..!

Good Health : నాడుల ఆరోగ్యం కోసం ఈ యోగా చేయండి..!

మానసిక ప్రశాంతత కావాలంటే శరీరంలో ఉండే వేలాది నాడులు, లక్షలాది నాడీకణాలు ఉత్తేజితం కావాలె. అన్ని నాడులు ఉత్తేజితం కావాలంటే పెద్దగా కష్టపడ్డాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ఐదు నిమిషాల పాటు నాడీశోధన ప్రాణాయామం చేస్తే చాలు. అయితే నాడీ శోధన ప్రాణాయామం చేసేముందు కొద్దిసేపు దండాసనం సాధన చెయ్యాలె. అప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటయ్.

ముందుగా పద్మాసనంలో కూర్చొవాలె. తర్వాత నెమ్మదిగా కళ్లు మూసుకొని కుడిచేతి బొటనవేలితో కుడివైపు ముక్కు మూసి ఎడమ ముక్కు నుంచి గాలిని బయటకు వదలాలి. తర్వాత నెమ్మదిగా గాలిని పీల్చాలె. ఇప్పుడు ఎడమవైపు ముక్కును ఉంగరపు వేలితో మూసి కుడివైపు నుంచి గాలి నెమ్మదిగా వదలాలె.

Also Read: జుట్టుకు రంగు వేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలంటే..! 

తిరిగి కుడివైపు నుంచి గాలిని పీల్చాలె... ఇలా ఐదు నిమిషాల పాటు చెయ్యాలె. ఇలా చెయ్యడం వల్ల శరీరంలో ఉన్న వేలాది నాడులు ఉత్తేజితమై..మానసిక ప్రశాంతం కలుగుతది. అలాగే, శ్వాసక్రియ సాఫీగా సాగి.. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అదుపులో ఉంటాయ్. హర్మోన్లలో సమతుల్యత కూడా ఈ ఆసనంతో సాధ్యమైతది. అయితే, జబులు, దగ్గు ఉన్నోళ్లు ఈ ఆసనాన్ని నిపుణుల సమక్షంలో చేస్తే మంచిది.