అది క్లిక్ చేస్తే ఫోన్ కొత్తదా? రిఫర్బిష్‌‌దా? అన్నది తెలుస్తది

అది క్లిక్ చేస్తే ఫోన్ కొత్తదా? రిఫర్బిష్‌‌దా? అన్నది తెలుస్తది

కొత్త మొబైల్‌‌ కొనడంకోసం డబ్బు దాచిపెట్టుకొని మరీ పండుగలప్పుడు పెట్టే ఆఫర్స్‌‌లో కొంటుంటారు కొందరు. అయితే, ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ పెరిగాక ఆన్‌‌లైన్‌‌ యాప్స్‌‌లోనే కొత్త మొబైల్స్‌‌ కొనేవాళ్ల సంఖ్య పెరిగింది. ఆన్‌‌లైన్‌‌లో కొన్న మొబైల్స్‌‌ ఒరిజినల్‌‌వి వస్తాయా? వేరేవాళ్లు రిటర్న్‌‌ పెట్టిన మొబైల్స్‌‌ని మనకు పంపుతారా? వాటిని ఎలా నమ్మాలి? అనే డౌట్స్‌‌ చాలామందికి వస్తుంటాయి. ఆ డౌట్స్‌‌ క్లారిఫై ఎలా చేసుకోవాలంటే...

ఆన్‌‌లైన్‌‌లో ‘బ్రాండ్‌‌ న్యూ’, ‘రిఫర్బిష్డ్’ అని రెండు రకాల మొబైల్స్‌‌ అమ్ముతారు. బ్రాండ్‌‌ న్యూ అంటే కొత్త మొబైల్‌‌. రిటర్న్‌‌ పెట్టిన, ఏదైనా ప్రాబ్లమ్‌‌ వచ్చిన మొబైల్స్‌‌ని రిఫర్బిష్డ్‌‌ మొబైల్‌‌ అంటారు. ఇవి సేల్‌‌ చేసేటప్పుడే మొబైల్‌‌ వివరాల్లో రిఫర్బిష్డ్‌‌ అని కనిపిస్తుంది. వాటి ధర కూడా తక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఆర్డర్‌‌‌‌ పెట్టిన మొబైల్‌‌ ప్లేస్‌‌లో రిఫర్బిష్డ్‌‌ మొబైల్‌‌ వస్తుంది. దాన్ని గుర్తుపట్టడం కూడా ఈజీనే. అందుకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి.

ఆండ్రాయిడ్‌‌ ఫోన్స్‌‌ని...

మొబైల్‌‌ డెలివరీ అయిన తరువాత సిమ్‌‌ వేయకముందే ఆన్ చేయాలి. డైలర్‌‌‌‌ ప్యాడ్‌‌లో ‘*#06# ’ అని టైప్‌‌ చేస్తే ఐఎంఇఐ నెంబర్‌‌‌‌, మోడల్‌‌ నెంబర్స్‌‌ వస్తాయి. ఆ నెంబర్‌‌ని ఫోన్‌‌ బాక్స్ మీద ఉన్న నెంబర్లతో పోల్చాలి. ఆ రెండు నెంబర్లు మ్యాచ్‌‌ అయితే అది ఒరిజినల్ మొబైల్‌‌. ‘ఫోన్‌‌ ఇన్‌‌ఫో యాప్‌‌’ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.‌‌ ‌‌యాప్‌‌ డౌన్‌‌లోడ్ చేసి ఫోన్‌‌ సీరియల్ నెంబర్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ చేయాలి. తరువాత యాప్‌‌ టాప్‌‌లో ఎడమ పక్క మూడు గీతలు కనిపిస్తాయి. దాంట్లో ‘రిఫర్బిష్​ చెక్’ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఫోన్ కొత్తదా? రిఫర్బిష్‌‌దా? అన్నది తెలుస్తుంది. లేదంటే ‘*#*#4636#*#*’ అని, లేదా *#*#0000#*#* అని డైలర్ ప్యాడ్‌‌లో టైప్ చేయాలి. అందులో ఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో సిమ్‌‌ స్టేటస్‌‌ ‘నన్‌‌’ అని చూపిస్తే అది ఒరిజినల్ మొబైల్‌‌ అని గుర్తించాలి. అంతేకాకుండా ‘అబౌట్‌‌ ఫోన్‌‌’లోకి వెళ్లి ఫోన్‌‌ స్టేటస్ ఓపెన్‌‌ చేయాలి. అందులో సిమ్‌‌ స్టేటస్‌‌ లేదా ఐఎంఇఐ ఇన్ఫర్మేషన్‌‌ ఆప్షన్స్ ఓపెన్ చేయాలి. ఐఎంఇఐ ఇన్ఫర్మేషన్‌‌లో సిమ్‌‌ స్లాట్స్‌‌లో ‘00’ ఉంటే అది కొత్త ఫోన్. వేరే ఏవైనా నెంబర్స్‌‌ ఉంటే అది వాడిన ఫోన్ అని గుర్తించాలి. లేదంటే ‘ఐఎంఇఐ. ఇన్ఫో’ వెబ్‌‌సైట్‌‌లో కూడా ఫోన్ ఇన్ఫర్మేషన్‌‌ని తెలుసుకోవచ్చు.

యాపిల్‌‌ ఫోన్స్‌‌ని... 

ఫేక్‌‌ మొబైల్స్‌‌ ఎక్కువగా యాపిల్‌‌లోనే వస్తుంటాయి. వీటినే క్లోన్ మొబైల్స్ అంటారు. వీటిని ఎలా గుర్తించాలంటే.. సెట్టింగ్స్‌‌ ఓపెన్‌‌ చేసి జనరల్‌‌లోకి వెళ్లాలి. అందులో అబౌట్‌‌ఫోన్​ క్లిక్ చేస్తే ఫోన్ డిటెయిల్స్‌‌ వస్తాయి. అందులో మోడల్ నెంబర్ ఉంటుంది. ఆ మోడల్‌‌ నెంబర్‌‌‌‌ ‘ఎం’ అనే లెటర్‌‌‌‌తో స్టార్ట్‌‌ అయితే అది ఒరిజినల్‌‌ ఫోన్‌‌. ‘ఎఫ్‌‌’ లెటర్‌‌‌‌తో మొదలైతే రిఫర్బిష్డ్‌‌, ‘ఎన్‌‌’తో మొదలైతే ఆఫోన్‌‌లో ఉన్న సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌ వల్ల రిటర్న్‌‌ చేశారని, ‘పి’తో స్టార్ట్‌‌ అయితే డ్యామేజ్డ్‌‌ ఫోన్ అని అర్థం. లేదంటే యాపిల్‌‌ వెబ్‌‌సైట్‌‌లోకి వెళ్లి ఫోన్ సీరియల్‌‌ నెంబర్‌‌‌‌ని ఎంటర్‌‌ చేయాలి. 
అందులో ఫోన్‌‌ కండిషన్ మొత్తం చూపిస్తుంది. అక్కడే ఫోన్ ఒరిజినలా కాదా అన్న విషయం తెలిసిపోతుంది.