టెట్ ఎగ్జామ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్

టెట్ ఎగ్జామ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్
  • వాయిదా పడే చాన్స్!
  • రెండ్రోజులా.. లేక మొత్తానికేనా అనే దానిపై తర్జనభర్జన

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో జరిగే నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఎఫెక్ట్ టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్)పై పడింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ ఆన్​లైన్ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. తాజాగా మే 27న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉంటుందని ఈసీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో టెట్ వాయిదా పడే పరిస్థితి నెలకొన్నది. పోలింగ్ రోజు, పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు చేయాలా.. షెడ్యూల్ మొత్తం వాయిదా వేయాలా అనే దానిపై విద్యాశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. టెట్–2024కు 2.86 లక్షల మంది అప్లై చేశారు. 

వీరిలో ఇన్ సర్వీస్ టీచర్లు 48 వేలకు పైగా ఉన్నారు. గతంలో ఒకేరోజు ఆఫ్ లైన్ లో రాష్ట్ర వ్యాప్తంగా టెట్​నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి ఆన్​ లైన్ లో నిర్వహించాలని నిర్ణయించడంతో ఎక్కువ రోజులు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండ్రోజుల కింద నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగా, మే 2న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో టెట్ ఆన్ లైన్ నిర్వహణపై అయోమయం నెలకొన్నది.  

అయితే, మే27న పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోజు కావడంతో12 జిల్లాల్లో హాలీడే ఉంటుంది. టెట్ కు అటెండ్ అయ్యేది గ్రాడ్యుయేట్స్ కావడంతోపాటు ఓటు హక్కు వినియోగించుకునేది కూడా గ్రాడ్యుయేట్సే. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో టెట్ ఎగ్జామ్ తేదీలపై ప్రపోజల్స్ పంపించాలని విద్యాశాఖ సెక్రెటరీ బుర్ర వెంకటేశం.. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులను ఆదేశించారు. దీంతో కొత్త తేదీలపై కసరత్తు చేస్తున్నారు. ఇతర పరీక్షలకు ఇబ్బంది లేకుండా తేదీలను పరిశీలిస్తున్నారు. అయితే, టెట్​ను రెండు రోజులు వాయిదా వేయాలా లేక టెట్ఎగ్జామ్ షెడ్యూల్ మొత్తం వాయిదా వేయాలా అనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్టు విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు.