Vakeel Saab Re-Release: పవన్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ మళ్ళీ థియేటర్స్కి వచ్చేస్తున్నాడు

Vakeel Saab Re-Release: పవన్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ మళ్ళీ థియేటర్స్కి వచ్చేస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్(Vakeel Saab) ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అజ్ఞాతవాసి ప్లాప్ తరువాత సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత చేసిన ఈ సినిమా ఆయనకు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. మంచి సామాజిక అంశంతో సందేశాత్మక చిత్రంగా వచ్చిన వకీల్ సాబ్ పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ను కూడా అలరించింది. 

ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాయర్ సత్యదేవ్ పాత్రలో ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. మరీ ముఖ్యంగాన్ కోర్టు సీన్స్ లో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించాయి. అయితే.. తాజాగా సమాచారం మేరకు వకీల్ సాబ్ సినిమా మరోసారి థియేటర్స్ లోకి రానుందంట. అవును ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. మే 1న ఈ సినిమా మరోసారి థియేటర్స్ లోకి రానుందట.

ఈ న్యూస్ తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే.. పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ, ఖుషీ, గుడుంబా శంకర్ వంటి సినిమాలు రీ రిలీజై సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని చవిచూస్తుందో చూడాలి.