హీరోలు ఇద్దరు – ‘వార్’ ఒక్కటే… టీజర్ విడుదల

హీరోలు ఇద్దరు – ‘వార్’ ఒక్కటే… టీజర్ విడుదల

రెండు కొదమ సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటది. అలా ఉంది  హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల వార్ మూవీ టీజర్. ఇద్దరు హీరోల మధ్య వార్ సీక్వెన్సులే హైలైట్స్ గా ఈ మూవీ తెరకెక్కింది. వాణికపూర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.

యాక్షన్ సినిమా ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఈ సూపర్ యాక్షన్ మూవీని తెరకెక్కించారు. యాష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. టీజర్ లోని యాక్షన్ సీక్వెన్సెస్ ఊపిరిబిగపట్టేలా ఉన్నాయి. టీజర్ కాబట్టి… బిట్స్ బిట్స్ గా చూపించి.. నిజంగానే టీజ్ చేశారు. మూవీపై ఇంట్రెస్ట్ పెరిగేలా చేయడంలో మూవీ మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇంత గ్రిప్రింగ్ యాక్షన్ టీజర్ లో వాణికపూర్ అందాల విందు కళ్లకు ఓ రిలాక్సేషన్ లాంటిది. టీజర్ RR అదిరిపోయింది.

వార్ సినిమా ప్రకటించినప్పటినుంచి ఈ మూవీపై బాలీవుడ్ లో అటెన్షన్ క్రియేట్ అయింది. టీజర్ రిలీజయ్యాక.. అవాక్కైపోయింది బాలీవుడ్. మ్యాచో ఇమేజ్ ఉన్న హృతిక్ రోషన్ కు ఇలాంటి అసలైన సినిమా పడితే మరో ధూమ్ 2 అవుతుందని అంటున్నారు అభిమానులు. సూపర్ 30 మూవీ డిజాస్ట్రస్ టాక్ తో డీలాపడిన హృతిక్ అభిమానులకు ఈ మూవీ వినోదాల విందు ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అక్టోబర్ 2న ఈ మూవీ విడుదల కానుంది. మూవీని సౌతిండియన్ లాంగ్వేజెస్ లోనూ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. టీజర్ ను ఆయా భాషల్లో టెక్స్ట్ తో రిలీజ్ చేశారు ఇద్దరు హీరోలు.