ఖైరతాబాద్‌ గణేషుడి దర్శనం.. పెరిగిన భక్తుల తాకిడి

ఖైరతాబాద్‌ గణేషుడి దర్శనం..  పెరిగిన భక్తుల తాకిడి

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణపతిని దర్శించుకునేందుకు  భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.  సుమారుగా నాలుగు లైన్లలో భక్తులు క్యూలో ఉన్నారు. భక్తులను పోలీస్ సిబ్బంది కంట్రోల్ చేస్తున్నారు.  మహా గణపతికి ఉదయం 11 గంటలకు తొలిపూజ జరిగింది. ఈ పూజలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ALSO READ: ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవాలు.. భారీ వినాయకుడి ప్రత్యేకతలు ఇవే

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు కావడంతో ఖైరతాబాద్‌ గణేషుడిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది. . ఈ ఒక్క రోజే లక్ష మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది.  కాగా ఈ సారి ‘శ్రీ దశమహా విద్యా గణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్‌ గణనాథుడు.   స్వామి వారికి కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు.