చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, ప్రముఖులు

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, ప్రముఖులు

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అక్టోబర్ 20న ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.  నగర నలుమూలల నుంచి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున   భక్తులు తరలి వస్తున్నారు . అమ్మవారి విగ్రహాన్ని  పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.  ఆలయం సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు అధికారులు.

ఇవాళ ఉదయం  తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ మంత్రి హరీశ్ రావు, బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్, దానం నాగేందర్, ఎంపీ లక్ష్మణ్, పలువురు రాజకీయ నాయకులు భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించారు.

దీపావళి నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి ఖజానా పంపిణి జరుగుతుంది.  అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్ తో పాటు కుబేర పూజ చేసిన కాయిన్స్ ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అమ్మవారి కాయిన్ లభిస్తే తమకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్ముతారు. దీంతో  నాణేలను సొంతం చేసుకునేందుకు  భక్తులు భారీగా తరలివస్తున్నారు. అక్టోబర్ 20  సాయంత్రం 7గంటలకు హారతి అనంతరం ఖజానా పంపిణి ప్రారంభం అవుతుంది.  23 వరకు  కాయిన్స్ పంపిణీ ఉంటుంది.