రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు గవర్నర్ తమిళి సై. రామజన్మ భూమి నిధి అభియాన్ బృంద కన్వీనర్ బందారి రమేష్, కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్, ఇతర సభ్యులు గవర్నర్ దగ్గర చెక్ తీసుకున్నారు.  రెండు లక్షల మంది నిధి సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. అంచనాలకు మించి విరాళాలు వసూల్ అవుతున్నాయన్నారు.

రామమందిరం నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. చెక్కును శ్రీరామ్ జన్మభూమి తీర్ద్ క్షేత్ర ప్రతినిధులకు అందజేశారు. రామాలయ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోట్లాదిమంది ప్రజలు కోరుకుంటున్నారన్నారు వివేక్. ఆకల త్వరలోనే సాకారం అవుతుందన్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కోటి రూపాయల విరాళం ఇచ్చారు బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ హోటల్ లో జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యదర్శి భయ్యాజి జోషికి చెక్ ను అందించారు.

కాంగ్రెస్ లీడర్, ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రామమందిర నిర్మాణం కోసం కోటి రూపాయల విరాళం ఇచ్చారు. అందిరిలాగే రామమందిర నిర్మాణం కోసమే ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ రూ. కొటి విరాళం ప్రకటించారు.

ప్రముఖ వ్యాపార వేత్త మేఘా కృష్ణారెడ్డి రామమందిర నిర్మాణం కోసం రూ. 6 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. మరో వ్యాపారవేత్త మైం హోం రామేశ్వరరావు రూ. 5 కోట్లు అందజేశారు.రామమందిర నిర్మాణానికి రూ. 30 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చెక్కును రాష్ట్ర RSS ప్రముఖ్ భరత్ కు అందజేశారు.

see more news

చంచల్ గూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదల