పైకి డ్రై ఫ్రూట్స్ షాపు.. లోపల డ్రగ్స్ దందా..

పైకి డ్రై ఫ్రూట్స్ షాపు.. లోపల డ్రగ్స్ దందా..

పండ్లు, డ్రై ఫ్రూట్స్ అమ్ముకుంటే ఏమొస్తాయి.. చిల్లర పైసలు తప్ప అనుకున్నాడో ఏమో.. డ్రై ఫ్రూట్స్ బిజినెస్ చాటున.. డ్రగ్స్ దందాకు తెర తీశాడు హైదరాబాద్ సిటీలోని ఓ బిజినెస్ మెన్. డ్రై ఫ్రూట్స్ షాపులోనే.. కొకైన్ అమ్మడం మొదలుపెట్టాడు.. షాపునకు వచ్చే కస్టమర్లు ఎటూ కొంచెం రిచ్ పీపుల్ కాబట్టి.. కొకైన్ సేల్స్ ను ఈజీగా పెంచేసుకున్నాడు.. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున డ్రగ్స్ అమ్మకాల్లోని కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. పూర్తి వివరాల్లోకి వెళితే..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు నైజీరీయన్ తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక నైజీరియన్ పరారీలో ఉన్నాడు. A2 నింధితుడిగా ఉన్న గాబ్రియల్  నైజీరియాకి పారిపోయాడని తెలిపారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.

డ్రై ప్రూట్స్ బిజినెస్ చేసే చింతా రాకేష్ డ్రగ్స్ బిజినెస్ లోకి దిగాడు. డ్రై ఫ్రూట్స్ బిజినెస్ లో నష్టం రావడంతో డ్రగ్స్ సరఫరాను మొదలు పెట్టాడు. క్రమంలో డ్రగ్స్ వ్యాపారం మూడు ప్యాకెట్లు.. ఆరు దందాలతో నడుస్తుండగా.. ఏకంగా హైదరాబాద్ ముఠాకు చింతా రాకేష్ లీడర్ గా మారిపోయాడు. గోవా నుంచి కొక్తెన్ తెచ్చి సప్లై చేస్తున్నట్టు సీపీ వెల్లడించారు. గోవాలో 7 వేలకు గ్రాము  చొప్పున కొకైన్ కొనుగోలు చేసి.. హైదరాబాద్ లో 18వేలకు అమ్మతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో కొకైన్ కి మార్కెట్ లో డిమాండ్ ఉందని.. అందుకే ఇక్కడకు అక్రమంగా రవాణా చేసి అమ్మకాలు చేస్తున్నారని వివరించారు. నిందితుల నుంచి  కోటి 33 లక్షల విలువైన 303 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు. రెండు కార్లు, ఐదు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

A4 నిందితుడు సూర్య ప్రకాష్ ని పట్టుకోవడం వల్ల డ్రగ్స్ ముఠా గుట్టు బయటపడ్డిందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డ్రగ్స్, కొకైన్ వినియోగగిస్తున్నారో తెలుసుకునే పనిలో ఉన్నామని చెప్పారు. వారిని పట్టుకుని NDPS యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం నోటీసులు ఇస్తామన్నారు. వాట్సాప్ ద్వారా కస్టమర్లను ఈ ముఠా సంప్రదిస్తున్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలు హోస్ట్ చేసి... కంజ్యుమర్స్ ని పిలిచి అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారని చెప్పారు. నిందితుల వాట్సాప్ చాట్ లో కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని తెలిపారు.