
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ ఎండీగా పని చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేసింది ప్రభుత్వం.
మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్ రెడ్డి డీజేపీగా బాధ్యతలు చేపట్టడంతో ఇంటెలిజెన్స్ బాధ్యతలను విజయ్ కుమార్‌కు అప్పగించింది ప్రభుత్వం. ఫైర్ డీజీగా పని చేస్తోన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇటీవల వరుస వివాదాలల్లో చిక్కుకుంటున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను స్పెషల్ సెక్రటరీగా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత నియమితులయ్యారు.
ఐపీఎస్‌ల బదిలీ:
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్
- ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విజయ్ కుమార్
- హోంశాఖ సెక్రటరీగా సీవీ ఆనంద్
- ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా రఘునందన్ రావు
- వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్
- జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా రిజ్వీ
- విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్
- గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్
- పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర
- ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి
- ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్
- హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీగా శ్రీనివాసులు
- హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతలను సీపీగా తసఫీర్ ఇక్బాల్
- వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్
- సిద్దిపేట సీపీగా విజయ్ కుమార్
- నారాయణ పేట్ ఎస్పీగా వినీత్
- ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ
- రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్
- మాదాపూర్ డీసీసీగా రీతిరాజ్
- ఎల్బీ నగర్ డీసీపీగా అనురాధ