భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట

భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. నరసింహుడి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. నరసింహస్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్​చార్జి బీర్ల అయిలయ్య వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి వారికి స్వామివారి లడ్డూప్రసాదం అందజేశారు. భక్తులు జరిపించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ. 35,09,668 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.14,80,640 ఇన్ కం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.