ముంబైలోని మలాద్ ప్రాంతంలో వారం రోజుల క్రితం ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న ఐస్ క్రీంలో చేతి వేలు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మలాడ్ పోలీసుల బృందం పూణేలోని ఇందాపూర్ తాలూకాలోని ఐస్ క్రీం ఫ్యాక్టరీలో పని చేస్తున్న 24 ఏళ్ల కార్మికుడి మధ్య వేలికి గాయాలు అయినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఐస్‌క్రీమ్‌లోని వేలు ఈ కార్మికుడిదేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడికి డీఎన్‌ఏ, వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
ఒక కార్మికుడి వేలికి గాయాలు తగిలినట్లు విచారణలో తేలింది. మేము విచారణ కోసం కార్మికుడి DNA నమూనాను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపాము. అతని వేలు ప్రమాదవశాత్తు విరిగిపోయింది,ఆ తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత ఆ వేలి భాగం ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదని మలాడ్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర తెలిపారు.
ముంబైలోని మలాద్ ప్రాంతంలో జూన్ 12న నాడు చోటు చేసుకుంది ఈ ఘటన. ఆన్ లైన్ డెలివరీ యాప్ లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీం తెరిచి చూడగా చేతి వేలు దర్శనం ఇవ్వగా షాకైన సదరు డాక్టర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అతడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం బుధవారం ఉదయం తన చెల్లి గ్రాసరీస్ ఆర్డర్ చేస్తుండగా తన కోసం మూడు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేయమని కోరాడు. అన్న చెప్పినట్టుగానే చెల్లి ఆర్డర్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసింది.
ఐస్ క్రీం ఓపెన్ చేసి తింటుండగా చేతి వేలు కనపడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని నుండి ఫిర్యాదు అందుకున్న మలాద్ పోలీసులు ఆ వేలు ముక్కను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపి... ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
