చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఆదివారం భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. జన్వాడకు చెందిన వడ్ల బాల సాయి(32), జుల్కల్ కు చెందిన పద్మ ఏడాది కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. సాయి ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, పద్మ ఇంటి వద్దే ఉండేది. వీరికి ఆరు నెలల కొడుకు ఉన్నాడు. ఈక్రమంలో ఆదివారం ఇంట్లో భార్యభర్తలు ఇద్దరూ దూలానికి ఒకే తాడుతో ఉరేసుకున్నారు. సమాచారం అందుకున్న మోకిల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను కిందికి దింపి పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా భార్యభర్తల మృతికి కుటుంబ కలహాలా.. ఆర్థిక ఇబ్బందులా.. అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
