ఓల్డ్‌సిటీ, వెలుగు : తాగొచ్చి భర్త పెట్టే వేధింపుల భరించలేక ఓ మహిళ చున్నీతో ఉరి వేసి హత్య చేసింది. ఈ ఘటన హైదరాబాద్ భవానీనగర్ పీఎస్ పరిధిలోని అక్రమ్ నగర్‌లో బుధవారం వెలుగుచూసింది.
అక్రమ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ ఇషాక్ (35) ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిసైన ఇషాక్ నిత్యం తాగొచొచ్చి భార్య నూర్జహాన్ బేగంను కొట్టేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
మంగళవారం సాయంత్రం సైతం ఇషాక్ మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన నూర్జహాన్ బేగం చున్నీతో ఉరి వేసి హత్య చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు భవానీనగర్ పోలీసులు తెలిపారు.
