భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్.. అత్తాపూర్ హుడా కాలనీలో ఘటన

భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్.. అత్తాపూర్ హుడా కాలనీలో ఘటన

గండిపేట, వెలుగు: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నారు. అత్తాపూర్  సీఐ నాగేశ్వర్ రావు తెలిపిన ప్రకారం.. అత్తాపూర్​ హుడా కాలనీలో నివాసముండే సంజయ్ కుమార్(23) డ్రై క్లీనింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం యూపీకి చెందిన అయేషాను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అయేషా పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన సంజయ్ బుధవారం ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.