తాగుబోతు భర్తను చంపిన భార్య

తాగుబోతు భర్తను చంపిన భార్య

హైదరాబాద్ : తాగుడికి బానిసై రోజూ వేధిస్తున్న భర్తను భార్య చంపిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..అల్వాల్ ప్రాంతానికి చెందిన నరేందర్ అతడి భార్య రమాదేవితో కలిసి 8 ఏళ్ల క్రితం మేడ్చల్ మండలంలోని రాయిలాపూర్  గ్రామానికి వచ్చి పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు. మద్యానికి బానిసై నరేందర్ రోజూ భార్య రమాదేవిని వేధించేవాడు. సహనం కొల్పోయిన రమాదేవి కల్లుసీసాతో నరేందర్ తలపై కొట్టడంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలా నికి చేరుకున్న పోలీసులు నరేందర్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం మేడ్చల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.