నామినేషన్ వేసిన హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థి

నామినేషన్ వేసిన హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థి

హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు నామినేషన్ సోమవారం వేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  ఈ ఉప ఎన్నిక పోటీ బీజేపి,టీఆర్ఎస్ మధ్యేనని అన్నారు.  2023 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక  నాంది అని తెలిపారు. తాను గెలిస్తే హుజూర్ నగర్ ను  మోడల్ నియోజకవర్గగా తీర్చిదిద్దుతానని అన్నారు.

కాంగ్రెస్,టిఆర్ఎస్ పార్టీలు బడుగు, బలహీన వర్గాలకు టిక్కెట్ ఇవ్వడానికి కూడా పరిశీలించలేదని రామారావు అన్నారు. బీసీ మహిళైన శంకరమ్మ ను టీఆర్ఎస్ పట్టించుకోలేదని అన్నారు. బలహీన వర్గాలకు ఒక్క బీజేపినే టిక్కెట్ కేటాయించిందన్నారు. ఆంధ్ర నుండి వచ్చిన సైదిరెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చి బరిలో దించిందని రామారావు ఆరోపించారు.

ఇంతకుముందు కోదాడ నుండి పోటీ చేసి…  అబివృద్ది చేయలేక ఓడిపోయానని చెప్పిన పద్మావతి, ఇప్పుడెలా గెలుస్తుందో చెప్పాలన్నారు. ఇక్కడి సమస్యలన్నీ రైతు బిడ్డగా తనకు తెలుసన్నారు. హుజూర్‌నగర్ కు జిల్లా స్థాయి మెడికల్ కాలేజీ కోసం కృషి చేస్తానని, స్థానికులకు పరిశ్రమల్లో 90 శాతం ఉద్యోగాల కల్పనకు పాటుపడతానని రామారావు అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ వేసేందుకు ఇక కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు వేశారు.

huzurnagar-bjp-candidate-kota-ramarao-file-his-nomination