V6 News

అథ్లెటిక్స్ లో సునంద తీన్ మార్

అథ్లెటిక్స్ లో సునంద తీన్ మార్
  • థాయ్​లాండ్​లో బంగారు పతకాల పంట
  • 3 గోల్డ్ మెడల్స్​తో సత్తా చాటిన సిటీ వనిత 
  • జనవరిలోనూ మూడు గోల్డ్ మెడల్స్​  

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని మెహదీపట్నానికి చెందిన చింత సునంద భారతి అథ్లెటిక్స్​లో బంగారు పతకాల పంట పండిస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు థాయిలాండ్​లో నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్​షిప్​లో పాల్గొని మూడు గోల్డ్​మెడల్స్​సాధించారు. 200 మీటర్ల , 400 మీటర్ల పరుగు పందెంతో పాటు షాట్​పుట్​లో మూడు బంగారు పతకాలు గెలుచుకున్నారు. సునంద గోల్డ్​మెడల్స్​సాధించడం ఇదే మొదటిసారి కాదు.. జనవరిలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లోనూ మూడు బంగారు పతకాలు గెలుచుకున్నారు.

మహిళల 400 మీటర్లు, 800 మీటర్ల రన్నింగ్, రిలే పోటీల్లో ఈ ఘనత సాధించారు. దీంతో థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్ లో జరిగిన ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించారు. సునంద భారతి ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే అథ్లెటిక్స్​లో ట్రైనింగ్​తీసుకుంటున్నారు. తన భర్త వేమనారాయణ రెడ్డి ప్రోత్సాహం, కుటుంబసభ్యుల మద్దతుతోనే ఈ విజయం సాధించినట్లు సునంద భారతి తెలిపారు.