మొదటి రోజే ఎక్కడికక్కడ తనిఖీలు.. హైదరాబాద్​లో 12 కిలోల బంగారం సీజ్

మొదటి రోజే ఎక్కడికక్కడ తనిఖీలు.. హైదరాబాద్​లో 12 కిలోల బంగారం సీజ్

హైదరాబాద్/​నెట్​వర్క్, వెలుగు: ఎన్నికల షెడ్యూల్​వచ్చిన తొలి రోజే చెక్​పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేసిన పోలీసులు సరైన ఆధారాలు లేని డబ్బు, బంగారంను పెద్ద మొత్తంలో సీజ్​చేశారు. అబిడ్స్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌ పరిధిలోని నిజాం కాలేజీ వద్ద పోలీసుల తనిఖీల్లో 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి పట్టుబడింది. దీని విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుంది. 

చందానగర్‌‌‌‌ పీఎస్​పరిధిలో పోలీసులు 5.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఫిలింనగర్‌‌‌‌ పరిధిలో షేక్‌‌‌‌పేట్‌‌‌‌ పరిధిలో రూ. 30 లక్షల నగదు, శంకర్‌‌‌‌పల్లి పీఎస్​పరిధిలో రూ. 80 లక్షలు,  హాబీబ్‌‌‌‌నగర్‌‌‌‌లో రెండు చోట్ల తనిఖీల్లో రూ.17 లక్షలు పట్టుబడింది. మంగళ్‌‌‌‌హాట్‌‌‌‌ పీఎస్​పరిధిలో రూ. 15 లక్షలు, చాదర్‌‌‌‌ఘాట్‌‌‌‌ పీఎస్ లిమిట్స్​లో రూ. 9.3 లక్షలు, షాద్‌‌‌‌నగర్‌‌‌‌లో రాయికల్‌‌‌‌ టోల్‌‌‌‌ ఫ్లాజా వద్ద రూ.11.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

జూబ్లీహిల్స్‌‌‌‌లోని ప్రగతినగర్‌‌‌‌, మధురానగర్‌‌‌‌, బోరబండ ప్రాంతాల్లో  అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.  చైతన్యపురి పీఎస్​పరిధిలో రూ.30 లక్షలు, వనస్థలిపురం పీఎస్​లిమిట్స్​లో రూ. 6.76 లక్షలు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలోని వైరా రింగ్ రోడ్డు సెంటర్​లో చేసిన తనిఖీల్లో పోలీసులు రూ. 5 లక్షల నగదు పట్టుకున్నారు. రూరల్ ఎస్సై ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ఖమ్మం నుంచి మధిరకు వస్తున్న కారులో  రూ.12 లక్షల 65 వేలను, తిరువూరు గంపలగూడెం నుంచి మధిర మీదుగా విజయవాడ వెళ్తున్న మరో కారులో  రూ.4,60,170 పట్టుకున్నారు. 

నిజామాబాద్​సిటీలో కార్లను తనిఖీ చేసి నలుగురి నుంచి  రూ.52.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బోధన్​లోని కొత్తబస్టాండ్​వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.5 లక్షలు సీజ్​చేశారు. ఆర్మూర్ లో శివారులోని కరీంనగర్ బైపాస్ రోడ్డు వద్ద ఓ వెహికల్ లో రూ.60 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

కుక్కర్లు, చీరలు సీజ్​

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధి శేరిలింగంపల్లిలోని గోపన్‌‌‌‌పల్లి తండాలో ఓటర్లకు పంచిపెట్టేందుకు రఘునాథ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ పేరుతో ముద్రించిన 90 కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్లలో ఓ పార్టీకి చెందిన వారు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో స్పెషల్ స్క్వాడ్ వెంకట్​రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేసి, ఓ ఇంట్లో మహిళా సంఘం సభ్యురాలి ద్వారా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్టు తెలుసుకుని 40 చీరలు రికవరీ చేశారు. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేశారు.