ఎంఐఎం సీనియర్ నేత రసూల్ ఖాన్ కన్నుమూత

 ఎంఐఎం సీనియర్ నేత రసూల్ ఖాన్ కన్నుమూత

ఎంఐఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ కన్నుమూశారు. కొంతకాలంగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే 28 మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీకి సేవలందించారు విరాసత్ రసూల్ ఖాన్.  1989లో తొలిసారిగా చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తరువాత 2009లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.  రసూల్ ఖాన్ కు భార్య, కుమారుడు ఉన్నారు.  శాంతినగర్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.   విరాసత్ రసూల్ ఖాన్  మృతిపట్ల ఎంఐఎం నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.