శంషాబాద్: అండర్ వేర్ లో కిలోన్నర బంగారం !

శంషాబాద్: అండర్ వేర్ లో కిలోన్నర బంగారం !
  •     ఆరు బంగారం బిస్కెట్లతో వచ్చి ఎయిర్​పోర్టులో చిక్కిన ప్రయాణికుడు 
  •     విలువ రూ.2.25 కోట్ల పైమాటే...

శంషాబాద్​, వెలుగు : శంషాబాద్‌‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. తిరుచ్చి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి అండర్​వేర్​లో రూ. 2.25 కోట్ల విలువ చేసే ఆరు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. 

సదరు ప్రయాణికుడు తన లో దుస్తుల కింద ప్రత్యేకంగా డిజైన్ చేసిన పౌచ్‌‌లో కిలోన్నర బరువున్న 6 బంగారు బిస్కెట్లను బ్లూ కలర్ అడెసివ్ టేప్, కార్బన్ పేపర్‌‌తో చుట్టి తీసుకువస్తుండగా డీఆర్​ఏ అధికారులు పట్టుకున్నారు. వీటి బరువు 1,481.780 గ్రాములు ఉంటుందని అంచనా.