
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోదస్తులు, ప్యాంట్ బెల్ట్ పట్టీల్లో దాచి తీసుకొచ్చాడు ప్యాసింజర్. అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బంగారం పట్టుబడింది.