హైదరాబాద్‌ సిటీ వాసులకు.. సంపూర్ణ చంద్ర గ్రహణంపై బిగ్ అప్డేట్ !

హైదరాబాద్‌ సిటీ వాసులకు.. సంపూర్ణ చంద్ర గ్రహణంపై బిగ్ అప్డేట్ !

ఈరోజు (సెప్టెంబర్ 7, 2025) రాత్రి 8 గంటల 59 నిమిషాలకు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. హైదరాబాద్ నగరవాసులకు కూడా సంపూర్ణ చంద్ర గ్రహణం స్పష్టంగా కనిపించనుండటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది 82 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు చూడొచ్చని.. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌‌‌‌లో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్ని చూసేందుకు ఎలాంటి అద్దాలు అవసరం లేదని చెప్పారు. ఇక మన దేశంలో చాలా ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని వెల్లడించారు.

‘‘ఆదివారం రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది” అని పేర్కొన్నారు. గ్రహణానికి ముందొచ్చే ఈ సూతక కాలంలో ఆలయాలు, ఇంట్లో పూజా మందిరాలు, ప్రార్థనా స్థలాలు మూసివేస్తారు. అలాగే ఈ సమయంలో భగవంతుడిని తాకరు.

ALSO READ : చంద్రగ్రహణం చూడాలనుకుంటున్నారా..? ఇండియాలో ఈ నాలుగు ప్రాంతాల్లో క్లియర్‎గా చూడొచ్చు..!

దీంతో పాటు దేవాలయంలో కూడా ఆరాధన కార్యక్రమాలు నిర్వహించరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుభ్రపరిచడం ద్వారా ఆరాధన పనులు ప్రారంభమవుతాయి. సూతక కాలం గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు ప్రారంభవుతుంది. గ్రహణం ముగిసే వరకు ఉంటుంది.