హైదరాబాద్ లోని బండ్ల గూడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. ఉద్యోగులు విధుల్లో ఉండగానే భవనం స్లాబ్ పెచ్చులూడి కిందపడిపోయాయ్. ఉద్యోగులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపరి పీల్చుకున్నారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.
హైదరాబాద్ పాత బస్తీలో 2003లో బండ్లగూడ మండలం కార్యాలయాన్ని నిర్మించారు. ఈ మండలం కార్యాలయంలో చంద్రాయణగుట్ట, యాకత్ పురా, బహదూర్ పురా నియోజకవర్గం ప్రజలకు సంబంధించిన రెవెన్యూశాఖ పనులు జరుగుతాయి. అక్టోబర్ 28న ఉదయం సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కార్యాలయంలో భవనం స్లాబ్ పెచ్చులు కింద పడటంతో ఫ్యాన్ విరిగిపోయింది. ఆసమయంలో సిబ్బంది కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే భవనం బీటలు వారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో భవనం ఎప్పుడు కూలీ పోతుందోనని భయాందోళనకు గురవుతున్నారు ఉద్యోగులు, సిబ్బంది.
